ETV Bharat / politics

రాష్ట్రాభివృద్ధి కోరుకునే వ్యక్తి పవన్​ కల్యాణ్​: ఎంపీ బాలశౌరి

MP Balasauri on Joining in Janasena: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకునే వ్యక్తి పవన్​ కల్యాణ్​ అని, అందుకే ఆయనతో కలిసి ప్రయాణం చేయటానికి నిర్ణయించుకున్నట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. తర్వలో మంచి ముహూర్తం చూసి ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరతానని చెప్పారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆయన ఈ మేరకు వెల్లడించారు.

MP_Balasauri_on_Joining_in_Janasena
MP_Balasauri_on_Joining_in_Janasena
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 10:30 PM IST

Updated : Jan 21, 2024, 10:38 PM IST

రాష్ట్రాభివృద్ధి కోరుకునే వ్యక్తి పవన్​ కల్యాణ్​: ఎంపీ బాలశౌరి

MP Balasauri on Joining in Janasena: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకునే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని, అందుకే ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నానని ఎంపీ బాలశౌరి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్​తో కలిసి ప్రయాణం చేయటానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్​తో రెండు గంటలు భేటీ అయ్యి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వెల్లడించారు. తర్వలో మంచి ముహూర్తం చూసి ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరతానని చెప్పారు.

పవన్ కల్యాణ్ విధి విధానాలు బాగున్నాయన్న ఆయన పోలవరం ప్రాజెక్టును తర్వలో పూర్తిచేసి రైతులకు అంకితం చేయడమే తన ధ్యేయం అని స్పష్టం చేశారు. మచిలీపట్నం, అవనిగడ్డ ఎప్పుడూ తన గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయన్నారు. 2024 సార్వత్రికలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు బాలశౌరి సమాధానం దాటవేశారు.

స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండలేను - త్వరలో నిర్ణయం ప్రకటిస్తా: ఎమ్మెల్యే ఆర్థర్

"రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకునే వ్యక్తి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. పవన్ కల్యాణ్ విధి విధానాలు బాగున్నాయి. అందుకే ఆయనతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్​తో రెండు గంటలు భేటీ అయ్యి రాష్ట్రంలో తాజా రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపాం. త్వరలో మంచి ముహూర్తం చూసి ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరతాను. మచిలీపట్నం, అవనిగడ్డ ఎప్పుడూ తన గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయి. పోలవరం ప్రాజెక్టును తర్వలో పూర్తిచేసి రైతులకు అంకితం చేయడమే నా ధ్యేయం.ఈ నేపథ్యంలో మా కుటుంబ దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విచ్చేసి స్వామి వారి ఆశీర్వచనాలు పొందాను" - వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు

అమరావతిపై జగన్ సర్కార్ మరో కుట్ర! - మాస్టర్​ ప్లాన్​ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం

MP Balasauri Visit Subrahmanyeshwar Swamy Temple: మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు మేలతాళాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. పులిగడ్డ, పెనఘూడి వారదికి ఇరువైపులా బాలశౌరికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలను, జనసేన జెండాలను ఏర్పాటు చేశారు. బాలశౌరిని ఆహ్వానిస్తూ అభిమానులు పెద్దఎత్తున టపాసులు కాల్చారు.

కాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బాలశౌరి వైఎస్సార్సీపీ నుంచి బయటకు రావటం చర్చనీయాంశమైంది. ఇటీవల హైదరాబాద్​లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్​తో బాలశౌరి భేటీ అయ్యారు. వీరిద్దరూ రెండు గంటలపాటు ఏపీలో తాజా రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఈసారి బందరు నుంచి బరిలోకి దిగుతారా? లేదా సొంతూరు గుంటూరుపై గురిపెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

విధ్వంసం, నాశనం చెయ్యడం తప్ప మార్పు తీసుకురావడం సీఎం జగన్​కు తెలుసా?: ఎమ్మెల్యే అనగాని

Last Updated : Jan 21, 2024, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.