MP Raghurama Krishna Raju Allegations on Jagan Cases: ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెదఅమిరంలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ వేసిన వాయిదాలను త్వరగా విచారించాలని ఒకటి, ఇన్నాళ్లూ కోర్టుకు వెళ్లకపోవడంతో బెయిల్ రద్దు చేయాలని మరొక పిటిషన్ వేసినట్లు రఘురామ తెలిపారు.
ఆ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఏప్రిల్ 1న విచారణకు రాబోతున్నయని అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రజాకోర్టుల్లో ఆ ఉన్మాదిపై ఒంటరిగా పోరాటం చేస్తున్నానని అన్నారు. నా కేసు తప్పు అనడానికి లేదని 3 వేలకుపైగా వాయిదాలు కోరిన మాట నిజం అని అన్నారు. అన్ని వాయిదాలు ఇవ్వకూడదనే నిబంధనలు చంట్టంలో ఉన్నమాట నిజం కాని చివరకు ఏమవుతుందో చూద్దామని అన్నారు.
సీఎం జగన్ ఎన్నోసార్లు నన్ను ఏదో చేద్దామని చూశారు కానీ తాను అనుకున్నదేమీ చేయలేకపోయారని అన్నారు. నన్ను పదవి నుంచి డిస్‌క్వాలిఫై చేయలేకపోయారు, చంపలేక పోయారు ఇలా చాలా విషయాల్లో జగన్ ఫెయిల్ అయ్యారని అన్నారు. ఇప్పుడు టికెట్ విషయంలో ఫెయిల్ అవుతారనుకున్నా కానీ తాత్కాలికంగా ఆయన విజయం సాధించారని అన్నారు. ముందుచూపుతోనే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో నేను చెప్పలేదని, బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చని తెలిపారు. తాను ఏ పార్టీలోనూ లేనని ఆ పార్టీలు కూడా అదే చెబుతున్నాయని అన్నారు.
జగన్ కొత్త హెలికాఫ్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు - త్వరలో వైసీపీకి గుడ్‌బై
చంద్రబాబు నాకు అన్యాయం చేయరు: ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై పూర్తి విశ్వాసం ఉందని రఘురామ అన్నారు. జగన్‌ని వాళ్లు నమ్మరు అనేది నా ప్రగాఢ నమ్మకమని, కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయగలననే విశ్వాసం ఉందని అన్నారు. జగన్‌ని ఎదుర్కొన్నప్పుడు నన్ను జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు ఏంతో సాయం చేశారని అన్నారు. అంత సాయం చేసిన వ్యక్తి ఇప్పుడు నాకు ఎందుకు అన్యాయం చేస్తారని అన్నారు. నన్ను చంపకుండా, నా పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్యాయం చేస్తారనే ఆలోచనా తనకు లేదని రఘురామ తెలిపారు.
ఆరున్నరేళ్ల తర్వాత మళ్లీ - జగన్ బస్సుయాత్రపై ప్రజల ఆగ్రహం - CM Jagan Bus Yatra
నాకు సీటు వచ్చే విషయంపై నా కన్నా ఎక్కువగా నా నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్రంలో జగన్‌ని ద్వేషించే అందరికీ తెలుసని రఘురామ అన్నారు. కానీ దానికి ఎన్నిరోజులు పడుతుందనేది చెప్పలేనని అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులతో నాకు పరిచయం గానీ, సాన్నిహిత్యం గానీ లేదని తెలిపారు. అందువల్లే అంతరం వచ్చి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. నాకు మద్దతుగా కొన్ని వేల మంది నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. కూటమి నూటికి నూరుశాతం నాకు న్యాయం చేస్తుందని దానికి మీరంతా మద్దతుగా రావాలని కోరుతున్నానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.