ETV Bharat / politics

ఆరు నెలలవుతున్నా కేటీఆర్​ను ఎందుకు అరెస్టు చేయట్లేదు : ఎంపీ రఘునందన్​రావు - MP Raghunandan Rao On CM Revanth - MP RAGHUNANDAN RAO ON CM REVANTH

MP Raghunandan Rao On CM Revanth : ఎఫ్​-1 రేసుకార్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని తెలిసి ఆరునెలలవుతున్నా కేటీఆర్​ను ఎందుకు అరెస్టు చేయడంలేదని సీఎం రేవంత్​ రెడ్డిని ఎంపీ రఘునందన్​రావు ప్రశ్నించారు. రేవంత్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేతల్లో ఏమీ చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ల తీరు అత్త కొట్టింది, కోడలు ఏడ్చింది అన్న చందంగా ఉందన్నారు.

MP Raghunandan Rao On CM Revanth
MP Raghunandan Rao On CM Revanth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 3:46 PM IST

Updated : Aug 11, 2024, 3:56 PM IST

MP Raghunandan Rao On CM Revanth : సీఎం రేవంత్​ రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్​ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్​-1 రేస్​ కార్లకు ఎలాంటి జీవో లేకుండా కేటీఆర్​ చెబితే రూ.50 కోట్ల ఇచ్చామని హెచ్​ఎండీఏ గ్రోత్​ కమిషనర్​ అర్వింద్​ కుమార్​ చెప్పి ఆరు నెలలవుతున్నా కేటీఆర్​ను రేవంత్​ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై రేవంత్​ రెడ్డి కేటీఆర్​తో అమెరికాలో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారేమో తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. సంగారెడ్డిలో హర్​ఘర్​ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్​, బీఆర్ఎస్​లపై పలు విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్​, కాంగ్రెస్​లు తోడు దొంగలు : కాంగ్రెస్​, బీఆర్ఎస్​లు మొదటి నుంచి తోడుదొంగల పార్టీలు అని రఘనందన్​రావు విమర్శించారు. ఈ రెండు పార్టీలు నాణేనికి బొమ్మబొరుసు లాంటివని అభివర్ణించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్​మీట్​లతో సరిపెడుతున్నాయి తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

రేవంత్​ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు : తప్పు చేసిన వాడు కొడుకైనా, కుమార్తైనా శిక్షించడానికి వెనుకాడనని ఆనాడు మాజీ సీఎం కేసీఆర్​ అన్నారని కానీ ఆయన మనసు ఒప్పలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేతల్లో ఏమీ చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ల తీరు అత్త కొట్టింది కోడలు ఏడ్చింది అన్న చందంగా ఉందన్నారు.

సుంకిశాల కూలిపోయిన విషయంపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్​కి దమ్ము లేదని రఘనందన్​ ఆరోపించారు. పాలకపక్షం నిద్రపోతే ప్రతిపక్ష బాధ్యత బీఆర్ఎస్​ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ​ఔటర్​ రింగ్​రోడ్డు వ్యవహారంలో రూ.1000కోట్లకు నోటీసులిచ్చిన హెచ్​ఎండీఏ అధికారి అరవింద్​ను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు.

"అరవింద్​ కుమార్​ అనే ఓ హెచ్​ఎండీఏ హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​కు కమిషనర్​గా చేసిన ఆయన ఎఫ్​-1 రేసు కార్లకు ఎలాంటి జీఓలు లేకుండా కేటీఆర్​ చెబితే తాను రూ.50 కోట్ల ఇచ్చానని చెప్పి ఆరు నెలలు అవుతుంది. కేటీఆర్​ను ఇంకా అరెస్టు చేయకపోవడం చూస్తుంటే అతడితో రేవంత్​ రెడ్డి అమెరికా పోయి చీకటి ఒప్పందాలు చేస్తున్నారనే అనుమానం కలుగుతుంది. ఏడున్నాడు అర్వింద్​ కుమార్​? అర్వింద్​ కుమార్​ను ఎందుకు అరెస్టు చేస్తలేరు?" - రఘునందన్​ రావు, ఎంపీ

'గత సీఎం పిట్టల దొరలా మాట్లాడితే - రేవంత్ రెండాకులు ఎక్కువే చదివినట్లు మాట్లాడుతున్నారు' - Raghunandhan Rao On CM Revanth

తెలంగాణకు హాని చేసే వారు ఎవరైనా సరే వారితో పోరాడతాం : రఘునందన్‌ రావు - Raghunandan Rao Meet The Press

Last Updated : Aug 11, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.