MLC Kavitha Interim Bail Petition in Delhi Liquor Case : కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. సోమవారం తీర్పు వెలువరించనుంది. అంతకు ముందు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై రిజాయిండర్‌ను కవిత తరఫు న్యాయవాదులు దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్‌పై కవిత తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
Delhi Liquor Case Update : అయితే బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, ఆమెకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. దిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారన్న ఈడీ, ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని కోర్టుకు తెలిపింది. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇవ్వలేదన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఆమె 10 ఫోన్లు ఇచ్చినా, అన్నీ ఫార్మాట్ చేసే ఇచ్చారని, నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని వివరించారు.
తిహాడ్ జైలుకు ఎమ్మెల్సీ కవిత - ఇంటి నుంచే భోజనం, మంచం, పరుపులకు వెసులుబాటు
ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజ్‌లను ధ్వంసం చేశారని కోర్టుకు ఈడీ వెల్లడించింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని కవిత బెదిరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. మరోవైపు తన కుమారుడి పరీక్షల కారణంగా బెయిల్ ఇవ్వాలన్న కవిత వాదనను ఈడీ వ్యతిరేకించింది. ఆమె చిన్న కుమారుడు ఒంటరి వాడు కాదని, తనకు సోదరుడు, కుటుంబసభ్యులు తోడుగా ఉన్నారని కోర్టుకు వివరించింది. ఆమె కుమారుడి పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని కోర్టు దృష్టికి తెచ్చింది. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 8న ఉదయం 10.30 గంటలకు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 20న వాదనలు కొనసాగనున్నాయి.