MLA Danam Nagender interesting Comments : త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ విధానాలే ఆ పార్టీని ముంచాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రముఖ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డే ఇప్పిటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని పేర్కొన్నారు.
MLA Danam Nagender on BRS : రాష్ట్రంలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని దానం నాగేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ చేరిక ఉంటుందని వెల్లడించారు.
ఎమ్మెల్యేలైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌లు తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారన్నారని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో కొందరు బీజేపీకి వెళ్లడానికి ట్రై చేస్తున్నారని వెల్లడించారు. అయోమయంలో పడిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటపడాలనుకుంటున్నారని తెలిపారు.
Pocharam Srinivas Reddy Join Congress : మాజీ సభాపతి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇవాళ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోచారం, ఆయన కుమారుడికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తరుణంలో పోచారం సలహాలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం రేవంత్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయనకు మద్దతుగా నిలిచేందుకే హస్తం పార్టీలో చేరినట్టు పోచారం తెలిపారు.
BRS Leaders Join Congress in Telangana : లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న సమయంలో కూడా ఎక్కువ మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల ముగియగానే హస్తం పార్టీలోకి వచ్చేందుకు ఇతర పార్టీ నాయకులు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రస్తుతం ప్రోచారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అప్పడు హస్తం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు నిజమవుతాయా అనే చర్చ ప్రజల్లో మొదలైంది.