ETV Bharat / politics

కాళేశ్వరంలో ఒక బ్యారేజీ కూలిపోయింది, మరొకటి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది: ఉత్తమ్ - మంత్రి ఉత్తమ్ కుమార్​ కామెంట్స్

Minister Uttam Kumar Reddy Comments on KCR, YS Jagan : కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేందుకు ఎలాంటి నిర్ణయం జరగలేదని, హరీశ్​రావు పూర్తి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పదేపదే ఏకాంత చర్చలు జరిపి కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర చేశారని ఆరోపించారు.

Minister Uttam Kumar Reddy On KRMB Issue
Minister Uttam Kumar Reddy Comments on KCR, YS Jagan
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 8:43 PM IST

Minister Uttam Kumar Reddy Comments on KCR, YS Jagan : కేఆర్‌ఎంబీకి కృష్ణా నదీ జలవనరుల ప్రాజెక్టులు అప్పగించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంలో కావాలనే హరీశ్​రావు(Harish Rao) తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కూడా హరీశ్‌రావు బ్లాక్‌మెయిలర్‌గా ఉన్నారని విమర్శించారు.

కేంద్రప్రభుత్వం పెట్టిన అఖిలపక్ష సమావేశంలోనూ తెలంగాణ కోసం తాను వాదించినట్లు వెల్లడించారు. రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్​,(CM Jagan) కేసీఆర్ కలిసి ఈ ప్రాజెక్టులపై కుట్రలు పన్నారని మంత్రి ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పోలింగ్ రోజు కుట్ర చేశారని, అందులో భాగంగానే ఇద్దరూ కుమ్మక్కై పోలింగ్​ రోజు సాగర్​ డ్యామ్​పైకి పోలీసులను పంపారన్నారు.

రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసిన ఘనత కేసీఆర్​దే : ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

"ఏ విధంగా చూసినా 2015లోనే తెలంగాణకు కృష్ణా జలాల్లో 551 టీఎంసీల నీరు రావాలి, అప్పటి ప్రభుత్వం డిమాండ్ చేయలేదు. రాష్ట్ర వాటా 299 టీఎంసీలు ఒప్పుకొని తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. 16వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. ప్రాజెక్టులను అప్పగించేందుకు ప్రతిపాదించినట్లు 2023-24 బడ్జెట్ డిమాండ్ బుక్​లో(Budget Demand Book) స్పష్టంగా పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం, అబద్ధాలతో బీఆర్ఎస్ పార్టీ జనాన్ని మోసం చేసే ప్రయత్నాన్ని ఎవరూ నమ్మడం లేదు"- ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి

Minister Uttam Kumar Reddy On KRMB Issue : కృష్ణా జలాల వాటాల్లో కేసీఆర్‌, జగన్‌ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను ఏపీకి తీసుకెళ్తుంటే కేసీఆర్‌ సహకరించారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు(Rayalaseema Lift Irrigation) ఏపీ కట్టుకునేందుకు కేసీఆర్‌ సహకరించారన్నారు. అదే విధంగా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచుతూ పోయారని, రూ.27 వేల కోట్లు పెట్టి పాలమూరు ప్రాజెక్టు నిర్మించి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు.

"మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించే ప్రక్రియ ఏమీ చేయలేదు. అదేవిధంగా అప్పజెప్పబోమని ఘంటాస్పదంగా తెలియజేస్తున్నాం. కేంద్రమంత్రి షెకావత్​కు కలిసినపుడు కూడా ఇదే విషయం చెప్పామన్నా సరే, మళ్లీ హరీశ్​రావు పదే పదే అబద్ధ ప్రచారం చేస్తున్నారు."-ఉత్తమ్ కుమార్​ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి

బీఆర్ఎస్​ పదేళ్లు అధికారంలో ఉన్నా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు ఉన్నందునే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయాలని కోరారని, గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా జలాలను వదులుకొని ఏపీకి అప్పజెప్పారని ఆరోపించారు. రూ.95 వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరంలో(Kaleshwaram Project) ఒక బ్యారేజీ కూలిపోయింది, మరొకటి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి వ్యాఖ్యానించారు.

పోలింగ్‌ రోజు కేసీఆర్‌, జగన్‌ కలిసి కుట్ర చేశారు: మంత్రి ఉత్తమ్‌

ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్ధం - కేసీఆర్​ సిద్ధమా?: సీఎం రేవంత్​ రెడ్డి

రాంచీకి రేవంత్ ​రెడ్డి - రాహుల్‌ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొననున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.