Minister Narayana Inspected TIDCO houses : రాజధాని ప్రాంతంలో టిడ్కో గృహాలను పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పరిశీలించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామన్నారు. వీటిలో 4 లక్షల 54 వేల 704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయిందని వివరించారు. 3 లక్షల 13,842 ఇళ్ల నిర్మాణాన్ని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2. 62 లక్షలకు దాన్ని కుదించారని మండిపడ్డారు.
గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందన్నారు. వచ్చే మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా గత ప్రభుత్వం వాడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కోరతామన్నారు.
టిడ్కో ఇళ్లకు హడ్కో చేయూత- రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు హామీ - Tidco Houses in ap
వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గడిచిన ఐదేళ్లలో పేదలు అనేక అవస్థలు పడ్డారని మంత్రి నారాయణ విమర్శించారు. తమ హయాంలో నాణ్యమైన సామగ్రితో టిడ్కో ఇళ్లు కట్టామని చెప్తూ.. టిడ్కో ఇళ్ల వద్ద వసతులు ఏర్పాటు చేయాలనేది ప్రణాళికగా నిర్ణయించామన్నారు. టిడ్కో ఇళ్ల వద్ద మరో మూడు నెలల్లో వసతులు కల్పిస్తామని, రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
వైఎస్సార్సీపీ నేతలు కేంద్రం నుంచి వచ్చే నిధులపై నిర్లక్ష్యం వహించారని, మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్లారని మండిపడ్డారు. ఖర్చు చేద్దామంటే సీఆర్‌డీఏ వద్ద రూపాయి లేదని తెలిపారు. స్కీమ్ మార్చడం వల్ల కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపోయారని వెల్లడించారు. రాజధాని గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లు, మౌలిక వసతులను పరిశీలించారు. టీడీపీ హయాంలో 5 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చి 4.54 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు.
2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని, కానీ, వైఎస్సార్సీపీ వచ్చాక టిడ్కో ఇళ్ల సంఖ్యను 2.62 లక్షలకు కుదించి, ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులను కోరతామని తెలిపారు. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు మొత్తం విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ వెల్లడించారు.
తొలగిపోతున్న అడ్డంకులు - టిడ్కో ఇళ్లకు హడ్కో రుణం - Tidco Houses in AP