Lokesh Whatsapp Block: యువగళం ద్వారా నేరుగా ప్రజల జీవన స్థితిగతులను పరిశీలించిన టీడీపీ నేత లోకేశ్.. సామాన్యుల సమస్యలపై స్పందించారు. ఒక్క మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తానని భరోసా కల్పించారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఏ సహాయం కావాలన్నా, మార్గదర్శకం కావాలన్నా అన్నగా తోడుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో లోకేశ్ వాట్సప్ నంబర్‌కు సమస్యల మెస్సెజ్‌లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలు ఎదురవడంతో మెటా బ్లాక్ చేసింది. దీనిపై లోకేశ్ ఏమన్నారంటే?
సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సప్ ను మెటా బ్లాక్ చేసింది. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న మంత్రి లోకేశ్ వాట్సప్ బ్లాక్ కావడం, తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని ఒక ప్రకటనలో కోరారు.
సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే ప్రకటించిన లోకేశ్.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో తన వాట్సప్‌కి వచ్చిన మెసేజ్ స్పందించిన లోకేశ్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన వారందరినీ అభినందించడంతో పాటు సొంత ఖర్చుతో ల్యాప్‌టాప్‌లు అందించారు. ఈ నేపథ్యంలో తమ సమస్య మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళితే చాలు.. పరిష్కారం అయిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేశ్‌కి వాట్సప్ చెయ్యడం వలన టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్సనల్ మెయిల్ ఐడి hello.lokesh@ap.gov.in కి సమస్యలన్నీ పంపించాలని విజ్ఞప్తి చేస్తూ తానే స్వయంగా హ్యాండిల్ చేస్తానని భరోసా కల్పించారు.
పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన "హలో లోకేశ్" కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న మంత్రి... తానే అందరి సమస్యలు నేరుగా పరిశీలిస్తానని ప్రకటించారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. మెయిల్ చేస్తే తాను స్పందిస్తానని తెలియజేశారు. వాట్సప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్‌లు చూసే అవకాశం ఉండటం లేదని , దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని మంత్రి నారా లోకేశ్ ఒక ప్రకటనలో విన్నవించారు.
ప్రజలకు భరోసా కల్పిస్తోన్న ప్రజాదర్బార్ - నేనున్నానంటున్న నారా లోకేశ్ - Nara Lokesh Prajadarbar
'ప్రజాదర్బార్' అనూహ్య స్పందన - సమస్యల పరిష్కారానికి లోకేశ్ భరోసా - Nara Lokesh Praja Darbar