Minister Nara Lokesh on Attacks on Dalits under YSRCP Govt: జగన్ హయాంలో దళితులపై దమనకాండకు సాక్ష్యాలు ఇవిగో అంటూ రాజ్యసభ సమాధానాన్ని మంత్రి నారా లోకేశ్ బయటపెట్టారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారని మండిపడ్డారు. జే బ్రాండ్స్‌పై పోరాడినందుకు హత్యలు చేశారని దుయ్యబట్టారు. ఇసుక అక్రమాలపై నోరెత్తినందుకు శిరోముండనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా దేశానికి తెలిసిందని అన్నారు.
2014 - 19 మధ్య తెలుగుదేశం పాలనలో ఏటా సగటున 2050 కేసులు దళితులపై నేరాలు వేధింపుల కేసులు నమోదయ్యాయని తెలిపారు. జగన్ పాలనలో 2020 - 21లో 10 వేల 952, 2021 - 22లో 13 వేల 529, 2022 - 23లో 12 వేల 782, 2023 - 24లో 19 వేల 719 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. గత ఐదేళ్ల జగన్ పాలన దళితులకు నరకయాతనయ్యిందని, వైఎస్సార్సీపీ పాలనలో దళితులపై దాడులు 10 రెట్లు పెరిగాయని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
జగన్ జమానా లో దళితుల పై దమనకాండకు ఇవిగో సాక్ష్యాలు. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. జే బ్రాండ్స్ పై పోరాడినందుకు హత్యలు చేశారు. ఇసుక అక్రమాల పై నోరెత్తినందుకు శిరోముండనం చేశారు. జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా దేశానికి తెలిసింది.#AndhraPradesh pic.twitter.com/DhA9ZkPH2z
— Lokesh Nara (@naralokesh) December 6, 2024
మంత్రి లోకేశ్‌ను కలిసిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు
"చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ" - లోకేశ్ ఎమోషనల్ ట్వీట్