ETV Bharat / politics

'కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్​కు లేదు - ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారు' - Komatireddy On Krishna Dispute

Minister Komatireddy Fires On KCR : కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు.

Minister Komatireddy Fires On KCR
Minister Komatireddy
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 12:55 PM IST

'కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్​కు లేదు - ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారు'

Minister Komatireddy Fires On KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఈ నెల 13వ తేదీన బీఆర్ఎస్ సభ(BRS Public Meeting in Nalgonda)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని వెంకట్‌ రెడ్డి ప్రకటించారు.

Minister Komatireddy Slams BRS Govt : కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీశ్‌ రావులకు లేదని మంత్రి వెంకట్‌ రెడ్డి(Minister Komatireddy On Krishna Water Dispute) అన్నారు. ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. జగన్‌తో లాలూచీ పడి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. నల్గొండ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పి ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి, రూ.లక్షల కోట్లు దోచుకున్నారని గత కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి ధ్వజమెత్తారు.

కృష్ణా జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్​ఎస్​ - 'ప్రాజెక్టుల'పై శాసనసభలో మాటల యుద్ధం

దొంగ దీక్షలతో అధికారంలోకి వచ్చారు : "అన్ని రంగాల వారికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్(Telangana Budget 2024) ప్రవేశపెట్టాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ విద్యా వ్యవస్థను నాశనం చేసింది. రాష్ట్రంలో 6 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. విద్య, వైద్యం కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. బీఆర్ఎస్ కమీషన్ల కోసం అవసరం లేని ప్రాజెక్టులను కట్టింది. కేసీఆర్ దొంగ దీక్షలు చేసి అధికారంలోకి వచ్చారు." అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

బీఆర్ఎస్ రూ.37 వేల కోట్ల అప్పులు చేసింది. కమీషన్ల కోసం అవసరం లేని ప్రాజెక్టులను కట్టింది. 299 టీఎంసీల నీళ్లు తెలంగాణకు ఇస్తామంటే నోరు మెదపకుండా సంతకం పెట్టారు. కుర్చీ వేసుకుని ఇక్కడే కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనికి ఫిబ్రవరిలోనే నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండకు అన్యాయం చేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తారు. ఈ నెల 13వ తేదీన బీఆర్ఎస్ తలపెట్టదలిచిన సభను మేం అడ్డుకుంటాం. ఆ సభకు నిరసనగా నల్గొండ ప్రధాన కూడలిలో నిరసన చేపడతాం. రాజకీయాలకు పనికిరాని జగదీశ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి జిల్లాను నాశనం చేశారు. - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి

నీళ్ల కోసం నోళ్లు తెరిచిన పైర్లు - దయనీయంగా పాలేరు పాత కాలువ ఆయకట్టు అన్నదాతల పరిస్థితి

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడాన్ని ఖండించడానికే ఛలో నల్గొండ సభ : కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.