Mallela Rajesh Naidu Allegations on Sajjala and Vidadala Rajini: ఎన్నికల నోటీఫికేషన్ రానున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతల టికెట్ మార్పుల ఆందోళన మెుదలైంది. ఇప్పటికే టికెట్ దక్కి, ప్రచారంలో దూసుకుపోతున్న నేతలకు, వైఎస్సార్సీపీ అధిష్టానం పలు చోట్ల షాక్ ఇస్తుంది. అప్పటి వరకూ తానే ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్న నేతల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడి పోరుతో ఆందోళన మెుదలైంది. టికెట్ ప్రకటించిన అభ్యర్థులను సైతం మారుస్తారనే ప్రచారంతో, వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపైకి వస్తున్నారు. ఆందోళనతో పాటుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల సమావేశం పెట్టిమరీ మంత్రులు, వైఎస్సార్సీపీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీలో ముసలం మెుదలైంది. మంత్రి రజిని, వైఎస్సార్సీపీ అధిష్టానంపై మల్లెల రాజేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్న రాజేష్ నాయుడు మంత్రి రజిని, సజ్జల రామకృష్ణా రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేష్ ను తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం మెుదలవడంతో, ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి రజిని తన వద్ద రూ. 6.5 కోట్లు తీసుకున్నారని రాజేష్ ఆరోపించారు. డబ్బుల విషయమై సజ్జలకు చెబితే, కేవలం రూ. 3 కోట్లు వెనక్కు ఇప్పించారని రాజేష్ పేర్కొన్నారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కార్యకర్తలు ముందు సజ్జలను మార్చాలి, పార్టీని బతికించాలంటూ విజ్ఞప్తి చేశారు.
మేనిఫెస్టో హామీలు విస్మరించిన జగన్ 100 పథకాలు రద్దు చేశాడు : నారా లోకేశ్
మంత్రి రజిని తన వద్ద రూ. 6.5 కోట్లు తీసుకున్నారు. డబ్బుల విషయమై సజ్జలకు చెబితే, కేవలం రూ. 3 కోట్లు వెనక్కు ఇప్పించారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని తనను మోసం చేసింది. గత ఐదు సంవత్సరాలుగా స్వంత పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టించారు. -మల్లెల రాజేష్ నాయుడు, వైసీపీ నేత
అందరి చూపు చిలకలూరిపేటవైపే - టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సభకు భారీ ఏర్పాట్లు
బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకోం: మంత్రి రజినికి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేయాలని రాజేష్ నాయుడు సవాల్ విసిరారు. మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే రూ.20 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని రాజేష్ తెలిపారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సైతం స్థానికుడికి మాత్రమే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇస్తే దగ్గరుండి మరీ ఒడిస్తామని అధిష్టానాన్ని హెచ్చరించారు. రాజేష్ నాయుడు మాట్లాడే సమయంలో కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకునేందుకు యత్నించటం కలకలం రేపింది. పక్కనే ఉన్న కార్యకర్తలు కిరోసిన్ బాటిల్ లాక్కున్నారు.
కూటమిని ఆశీర్వదించండి - సీట్ల సంఖ్య కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: చంద్రబాబు, పవన్