ETV Bharat / politics

విశాఖలో అవినీతి అనకొండ వాటా ₹2వేల కోట్లు- పేదల భూముల క్రమబద్ధీకరణకు మాస్టర్​ ప్లాన్​ - GVMC

Regularization of assigned lands : ఆ అత్యున్నత అధికారి ఒక అవినీతి అనకొండ. పుష్కలంగా ప్రభుత్వ పెద్దల అండదండలతో హద్దుపద్దు లేకుండా చెలరేగిపోయారు. అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ నిర్ణయం ఆయనకు ముందే తెలుసు. ఆ విధాన నిర్ణయంలో ఆయన కూడా భాగస్వామి కావడంతో వ్యూహాలకు పదను పెట్టారు. అసలు సిసలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు తెరలేపారు. విశాఖ చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా డి-పట్టా భూముల్ని బినామీల ద్వారా చౌకగా కొనిపించి ఎంచక్కా క్రమబద్ధీకరించుకుంటున్నారు. ఆయన కొల్లగొట్టిన భూముల విలువ 2 వేల కోట్ల రూపాయల పైమాటే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

regularization_of_assigned_lands
regularization_of_assigned_lands
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 8:39 AM IST

Regularization of assigned lands : దేశాన్ని పాలించిన ఒక ముఖ్య నాయకుడి పేరు పెట్టుకున్న ఆ అత్యున్నతాధికారి పుత్రరత్నం కోసం పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌ వ్యవహారాలు సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇటీవల విశాఖ చుట్టుపక్కల పేదల ఎసైన్డ్‌ భూములను అనకొండలా మింగేశారు. నిర్దిష్ట గడువు దాటాక లబ్ధిదారులకు ఎసైన్డ్‌ భూముల్ని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో కీలక భాగస్వామి అయన. ఆ ప్రతిపాదన చర్చల దశలో ఉండగానే ఆయన మాస్టర్‌ప్లాన్‌ (Master Plan) వేశారు. విశాఖ శివారులోని పలు గ్రామాల పేదలకు చెందిన సుమారు 200 ఎకరాలకుపైగా డి-పట్టా భూములను బినామీలతో కొనుగోలు చేయించారు. యజమానులకు ఎకరానికి 30 నుంచి 40 లక్షల రూపాయలు ముట్టజెప్పి తన బినామీల పేరు మీద జీపీఏ, భూ విక్రయ ఒప్పందాలు చేసుకున్నారు. ఎసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చట్టసవరణ చేయగానే తాను కొనుగోలు చేసిన భూములకు 22(ఎ)నుంచి వేగంగా మినహాయింపునిచ్చేలా జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తీసుకువచ్చారు. అంత పెద్ద అధికారే చెప్పేసరికి ఆఘమేఘాల మీద ఆ భూముల్ని డీనోటిఫై (Denotify) చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్ని దర్జాగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. పెందుర్తి, ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం మండలాల పరిధిలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇప్పుడు ఆయన వశమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి విలువ ఎకరం 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పలుకుతోంది. ఆనందపురం మండలంలో అక్రమంగా చేతులు మారిన 200 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్​లో రూ.1,500 కోట్ల నుంచి 2 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆ అధికారి బినామీలకు భూములు అమ్ముకున్న పేద రైతుల్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీలే ఉండడం విచారకరం.

పీలేరులో భూ ఆక్రమణ : ఎట్టకేలకు అధికార యంత్రాంగంలో కదలిక

విశాఖలోని అత్యంత విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములపై కన్నేసిన అధికార పార్టీ ముఖ్య నాయకులు విచ్చలవిడిగా దోపిడీపర్వం కొనసాగించారు. ఐదేళ్లు అధికారంలో ఉండే నాయకులే వేల కోట్ల విలువైన భూముల్ని మడతెట్టేస్తుంటే 34 ఏళ్ల పాటు సర్వీసులో ఉండే మనం ఇంకెంత దందాలు చేయాలా? అని ఆ అత్యున్నతాధికారి ఆలోచించనట్టున్నాడు. ప్రభుత్వ పెద్దలు విశాఖలోని దసపల్లా, ఎన్‌సీసీ, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో వంటి అత్యంత విలువైన భూముల్ని స్వాహా చేయగా వారికేమీ తీసిపోని విధంగా పేదల భూములపై కన్నేశారు. జేసీ స్థాయి నుంచి వివిధ హోదాల్లో పని చేసి ఉన్నత స్థానానికి చేరుకున్న ఆ అధికారికి రెవెన్యూ వ్యవహారాల్లోని లొసుగులన్నీ కొట్టిన పిండి. డి-పట్టా భూముల్ని క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం పేదలకు తెలియకముందే వారి భూములు కొట్టేసి కోట్లలో లబ్ధి పొందారు. రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అసత్యప్రచారం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు విశాఖలో పేదల భూములతో చేసిన దందాని విస్మరించారు.

కన్నేసి...మార్చేసి..కబ్జాచేసి..!

పేదలకు చెందిన డి-పట్టా భూముల్ని కొట్టేసేందుకు పక్కా స్కెచ్​ వేశారు. పకడ్బందీగా అమలు చేసేందుకు ముగ్గురు బినామీల్ని విశాఖలో దించారు. వీరిలో ఒకరు చందమామను తలపై ధరించిన ఈశ్వరుడు కాగా, మూడు లోకాల్లో పూజ్యనీయుడైన సాయి, భరతజాతికి మూలపురుషుడి పేరు పెట్టుకున్న ఇంకో వ్యక్తి ఉన్నారు. ఈ ముగ్గురూ అత్యున్నతాధికారి తరఫున భారీగా డి-పట్టా భూములు కొనుగోలు చేసి తమ పేరుపై జీపీఏ చేయించుకున్నారు. డీనోటిఫికేషన్‌ (Denotification)ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆగితే ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్న ఉద్దేశంతో ముందుగానే జీపీఏ పూర్తిచేశారు. భూముల్ని తమకు అమ్మకపోతే నష్టపోతారని, వాటిపై ఎప్పటికీ హక్కులు సంక్రమించవని భయపెట్టారు. ప్రభుత్వం తన అవసరాలకు తీసుకుంటే ఎలాంటి పరిహారం రాదని ఆందోళన రేకెత్తించి కారుచౌకగా భూముల్ని కొట్టేశారు. ప్రభుత్వం డి-పట్టా భూముల్ని క్రమబద్ధీకరించనుందనే విషయం తెలియని యజమానులు తీవ్రంగా నష్టపోయారు. డి-పట్టా భూములకు 22ఎ మినహాయింపు కల్పిస్తూ కలెక్టర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడమే ఆలస్యం చకచకా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కానిచ్చేశారు. ఆనందపురం మండల పరిధిలో కోలవానిపాలెం, రామవరం, గండిగుండం, మామిడిలోవ, పందలపాక, చందాక, పేకేరు, గొట్టిపల్లి, బాకూరుపాలెం, గిడిజాల, శొంఠ్యాం గ్రామాల పరిధిలో సుమారు 200 ఎకరాల భూముల్ని డీనోటిఫై చేశారు. ఇప్పుడు ఆ భూములన్నీ బినామీల పేరుమీదకు మారిపోయాయి. పెందుర్తి, పద్మనాభం, భీమునిపట్నం వంటి మండలాల పరిధిలోనూ వందల ఎకరాల డీనోటిఫై భూములకూ గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.

రాజమహేంద్రవరం భూ దందా.. విజయవాడ అధికారుల పాత్ర

డి-పట్టా భూముల క్రమబద్ధీకరణపై చట్టసవరణ 2023 ఆగస్టులో జరిగితే 22(ఎ) జాబితా నుంచి మినహాయించే ప్రక్రియ తాజాగా జనవరి 17న ప్రారంభమైంది. ఉన్నతాధికారితో పాటు, వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉండటంతో డీనోటిఫికేషన్‌ ప్రక్రియ వేగం చేయాలని అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. వారికి అనుకూలంగా వ్యవహరించని కారణంగానే జేసీ విశ్వనాథ్‌ బదిలీ అయ్యారని ఆరోపణలున్నాయి. తమ మాట వినకపోతే మీకూ ట్రాన్స్​ఫర్​ తప్పదని, అవసరమైతే సస్పెన్షన్​ వేటు వేయిస్తామని అధికారులను బెదిరిస్తున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు 300 ఎకరాల డి-పట్టా భూములు కొనడంతో వాటిని 22(ఎ) నుంచి మినహాయించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. పార్టీలో క్రియాశీలకంగా, నామినేటెడ్‌ పోస్టులో ఉండి, ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన ఓ నాయకుడు ఆనందపురం మండలం గండిగుండం పరిధిలో 15 ఎకరాల వరకు కొన్నట్లు పత్రాలు వెలుగులోకి వచ్చాయి. సదరు భూములు ఆ నేత పేరునే బదిలీ అయ్యాయి. గతంలో ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఓ నేత బినామీల పేరుతో భోగాపురంతోపాటు, ఆనందపురం పరిధిలో భారీగా డి-పట్టా భూములు కొనడం గమనార్హం.

ఏసీబీ వలలో కొండాపురం ఎస్సై - పెట్రోల్‌ బంకు నుంచి బ్యాంకు ఖాతాకు రూ. లక్షల్లో లావాదేవీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.