ETV Bharat / politics

జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్​పై డీజీపీ సమాధానం చెప్తారా ? : లోకేశ్ - LOKESH QUESTIONED TO DGP - LOKESH QUESTIONED TO DGP

Nara Lokesh on Container Vehicle at CM Camp Office: పోలీసులు రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారని మరి సీఎం ఇంట్లోకి నిబంధనలు అతిక్రమించి వెళ్లిన కంటెయినర్ సంగతేంటని నారా లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులు కళ్లెదుటే వెళ్లిన కంటెయినర్​ను ఎందుకు తనిఖీ చేయలేదని అన్నారు. అంతే కాకుండా ఓటమి భయంతోనే తాయిలాలిచ్చి ఓటర్లను ఏమార్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు.

nara_lokesh_on_container
nara_lokesh_on_container
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 11:45 AM IST

Nara Lokesh on Container Vehicle at CM Camp Office: సీఎం జగన్​ ఇంట్లోకి నిబంధనలు అతిక్రమించి వెళ్లిన కంటెయినర్ సంగతేంటని నారా లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులు రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారని ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘనైనా కనిపించిందా అని ప్రశ్నించారు. పోలీసులు కళ్లెదుటే జగన్ నివాసంలోకి వెళ్లిన కంటెయినర్​ను ఎందుకు తనిఖీ చేయలేదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేశ్​ ప్రశ్నించారు. ఆ కంటెయినర్​లో ఏముందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రెజిల్ సరకా, మద్యంలో మెక్కిన వేల కోట్లు కంటెయినర్​లో తెచ్చారా అని నిలదీశారు. లండన్ పరారీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారా లేక ఏపీ సెక్రటేరియట్ దాచిన దొంగ ఫైళ్లు కంటెయినర్​లో వచ్చాయా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు డీజీపీ సమాధానం చెప్పగలరా అని లోకేశ్ సవాల్ విసిరారు.

సీఎం క్యాంప్​ ఆఫీసులోకి కంటెయినర్​- ఎందుకొచ్చింది, ఏం తెచ్చింది? - Suspected Container Vehicle

తాయిలాలతో ఓటర్లను ఏమార్చే కుట్ర: ఓటమి భయంతోనే తాయిలాలిచ్చి ఓటర్లను ఏమార్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన జనం జగన్​ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్​లో బంధించాలని నిర్ణయానికొచ్చిన నేపథ్యంలో చీప్ ట్రిక్స్​తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగో గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోదాములో పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్​ను అధికారులు పట్టుకున్నారన్నారు.

వైసీపీ నేతల అధికార గర్వం - అర్చకులపై ఆగని దాడులు - YSRCP Leaders Attacks on Priests

టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్ నైతే పట్టుకున్నారు మరి ఇసుక, లిక్కర్​లో జగన్ దోచుకున్న డబ్బులను ఎప్పుడు పట్టుకుంటారని లోకేశ్​ ప్రశ్నించారు. అలానే ఎన్నికల్లో పంచడానికి జగన్ సిద్ధం చేసిన డబ్బుల డంప్​ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కిలో బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలని లోకేశ్​ హితవు పలికారు.

ప్రచారానికి 15 మందిని తీసుకొస్తావా ! - వృద్ధురాలిని చెప్పుతో కొట్టిన వైసీపీ నేత - YCP LEADER ATTACK ON OLD WOMAN

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.