Lok Satta Party support to NDA Alliance: అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిచ్చే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి జేపీ మద్దతు ప్రకటించడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో పాటుగా నారా లోకేశ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినందుకు జయప్రకాశ్ నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షేమమే పరమావధిగా: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా మన డబ్బేనని, ఎవ్వరు వారి సొంత డబ్బులు ఇవ్వటం లేదని జేపీ పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పాల్గొనాలంటే కులం, అక్రమ సంపాదన తప్ప మిగిలిన ఏ అర్హత అవసరం లేదన్నారు. తాను ఉన్న వాస్తవమే చెబుతున్నానని, కానీ తనను కూడా కులం పేరుతో విమర్శిస్తున్నారని జేపీ వాపోయారు. సంక్షేమం అవసరమే కానీ సంక్షేమమే పరమావధిగా ఉండకూడదన్నారు. ఎన్టీఏ కూటమి సంక్షేమంతో పాటు అభివృద్దికి కూడా ప్రణాళికలు రచిస్తుందని, అందుకే తాను మద్దతు ఇస్తున్నానని జేపీ తెలిపారు.
మన పిల్లల భవిష్యత్ ఏంటి: ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జయప్రకాశ్ నారాయణ సూచించారు. కేవలం సంక్షేమమే పరిపాలన అనుకుంటే, ఆ దేశం, ఆ రాష్ట్రం నాశనం అవ్వడం ఖాయమన్నారు. మన పిల్లల భవిష్యత్ ఏంటి అని అందరూ ఆలోచించాలన్నారు. సంక్షేమం అంటేనే, వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. అదే అభివృద్ది అంటే, దీర్ఘకాలికంగా సమాజంలో సంపద సృష్టి పెంచడమన్నారు. ఉపాధి, పెట్టుబడులు ప్రోత్సహించి పని చేసుకుంటూ ఎవరి కాళ్ల మీద వారు నిలబడగలరని పేర్కొన్నారు. నేడు ఎపీలో సంక్షేమం, అభివృద్ది పైనే ప్రధానంగా పోరాటం సాగుతుందన్నారు.
రాజధానులను మార్చే అధికారం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: జేపీ
ఏపీలో కులాల గురించి చర్చ: ఎపీలో కులాలు, ముఠాల ప్రస్తావనే ఎక్కువుగా జరగడం విచారకరమని జయప్రకాశ్ నారాయణ అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల భవిష్యత్ గురించి ప్రస్తావన తక్కువ, కులాల గురించి చర్చ ఎక్కువుగా కనిపిస్తుందన్నారు. కులాలకు అతీతంగా పని చేసే వారు నేడు కనిపించడం లేదన్నారు. ఏ తప్పు ఎత్తి చూపినా, వెంటనే కులం, మతం, ప్రాంతం తెరపైకి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు దేశం, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన పిల్లల భవిష్యత్ ను ఎలా కాపాడుకోవాలో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు.
JP on debts: ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి: జయప్రకాశ్ నారాయణ
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిచ్చే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాను. ఎన్నికలలో ప్రజలు ఇచ్చే తీర్పు సమాజ మార్పులో కీలక పాత్ర పోషిస్తుంది. అధికారంలో ఎవరు ఉంటే, వారు నియంతలా వ్యవహరిస్తున్నారు.నచ్చిన పార్టీకి, నమ్మిన పార్టీకి నిర్భయంగా ఓటు వేయాలి. ఈ విషయంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈవీఎంలపై వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మకూడదు. ఓడిపోయిన వారు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం పరిపాటి.
కోపంతోనో, కసితోనో ఓటేయకండి - ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి : జయప్రకాశ్ నారాయణ
Chandrababu and Lokesh Reaction on JP Comments : ఎన్డీఏ కూటమికి జేపీ మద్దతు ప్రకటించడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో పాటుగా నారా లోకేశ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినందుకు జయప్రకాశ్ నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.