ETV Bharat / politics

తెలంగాణ లోక్​సభ ఎన్నికల కౌంటింగ్ షురూ - డబుల్ డిజిట్ దక్కేదెవరికి? - Telangana Lok Sabha Poll Results - TELANGANA LOK SABHA POLL RESULTS

Lok Sabha Poll Results in Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధాన పార్టీలు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డాయి. ముఖ్యంగా రెండంకెల సీట్లపైనే దృష్టి సారించాయి. ఇవాళ వెలువడనున్న ఫలితాలతో ఏ పార్టీకి సింగిల్, లేదా డబుల్ డిజిట్ స్థానాలు వచ్చాయనేది తేలిపోనుంది.

Telangana Lok Sabha Election Results 2024
Telangana Lok Sabha Election Results 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 7:42 AM IST

Updated : Jun 4, 2024, 8:04 AM IST

Telangana Lok Sabha Election Results 2024 : తెలంగాణలో రసవత్తరంగా సాగిన పార్లమెంట్ ఎన్నికల ఉత్కంఠకు తెర పడే సమయం ఆసన్నమైంది. పోలింగ్‌ ముగిసిన 21 రోజుల తర్వాత, ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా జాతీయ, రాష్ట్రస్థాయి నాయకలకు సవాల్‌గా నిలిచిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్​తో పాటు రాష్ట్రంలో బలపడే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.

Lok Sabha Election Results 2024 : మూడు పార్టీలూ రెండంకెల స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పోటీ పడ్డాయి. ఉన్న 17 సీట్లలో రెండంకెల సీట్లు వస్తే, అది ఒక పార్టీకే పరిమితం. మూడింటిలోనూ ఏ పార్టీకైనా ఆ భాగ్యం దక్కనుందా? ఒకవేళ లేదా అన్ని పార్టీలు సింగిల్‌ డిజిట్‌ సీట్లతోనే సరిపుచ్చుకోవాలా అనేది తేలిపోనుంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఐదు నెలలకే జరిగిన పార్లమెంట్​ పోరులో సర్వశక్తులూ ఒడ్డిన ఈ మూడు ప్రధాన పార్టీలూ అత్యధిక స్థానాలను ఆశిస్తున్నాయి.

పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​కు పట్టం కట్టిన ఓటర్లు ఈసారి కూడా మద్దతుగా నిలిచారని ఆ పార్టీ ధీమాతో ఉంది. లోక్‌సభ ఎన్నికలు కావడంతో ప్రధానిగా మోదీ నాయకత్వానికే ప్రజలు ప్రాధాన్యమిచ్చి బీజేపీ వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని, తమ ఓటుబ్యాంకు చెక్కుచెదరలేదని, హస్తం పార్టీ ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తి కలిసి వస్తుందని బీఆర్ఎస్​ విశ్వాసంతో ఉంది.

అదృష్టవంతులెవరో : శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ లోక్‌సభ బరిలో సర్వశక్తులూ ఒడ్డింది. మెజారిటీ స్థానాలను ఆశిస్తూ బీజేపీ, బీఆర్ఎస్​లు కూడా పోటాపోటీగా ప్రచారాన్ని కొనసాగించాయి. గత నెల 13న జరిగిన పోలింగ్‌ సరళిని విశ్లేషించుకుని తాజాగా వచ్చిన ఎగ్జిట్‌పోల్‌ అంచనాలతో తమకు దక్కే స్థానాలపై ప్రధాన పార్టీలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఓట్ల లెక్కింపులో వెలువడే అసలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన హస్తం పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు రెఫరండమే అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారంలో ప్రకటించారు. తమకు రెండంకెల స్థానాలు ఖాయమని బీజేపీ అగ్రనేతలు పదే పదే చెప్పారు. అటు బీఆర్ఎస్ కూడా తమకు సిటింగ్‌ స్థానాలతో పాటు అదనపు సీట్లు ఖాయమన్న విశ్వాసంతో ఉంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీపడగా వీరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థులు 51 మందితో పాటు సీపీఎం, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కోచోట బరిలో ఉన్నారు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితికి తొమ్మిది సిటింగ్‌ స్థానాలుండగా, కమలం పార్టీకి నాలుగు, కాంగ్రెస్‌కు మూడు, ఎంఐఎంకు ఒక సిటింగ్‌ స్థానం ఉన్నాయి.

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ముఖ్యనేతలు : పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నవారిలో పలువురు కీలక నాయకులు ఉన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మరో కీలకనేత ఈటల రాజేందర్‌ తదితరులు బరిలో ఉన్నారు. మారిన సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరో గులాబీ పార్టీ ఎంపీ బీబీ పాటిల్‌ కమలం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫున బరిలో దిగారు. హైదరాబాద్‌ నుంచి వరుసగా గెలుస్తున్న ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి పోటీలో ఉన్నారు.

జాతీయ నాయకత్వాల ప్రత్యేక దృష్టి : తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీల జాతీయ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గతంలో కంటే విస్తృతంగా రాష్ట్రంలో ప్రచారం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి ఆఖరి రోజు ప్రచారం దాకా కూడా కమలం పార్టీ అగ్రనాయకులు, జాతీయ నాయకత్వం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ప్రచారంలో భాగస్వాములయ్యారు.

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా రాష్ట్ర మంత్రులు, కీలక నేతలకు ఒక్కో లోక్‌సభ స్థానం బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో బస్సుయాత్ర ద్వారా విస్తృత ప్రచారం చేయగా, కేటీఆర్, హరీశ్‌రావు కూడా పలు నియోజకవర్గాల్లో ప్రచారసభలు, రోడ్‌షోలు నిర్వహించారు.

కీలక నియోజకవర్గాలపై అందరి దృష్టి : తెలంగాణలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు సాగింది. దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ స్థానమైన మల్కాజిగిరి మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. గత శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలోనూ విజయం సాధించిన బీఆర్ఎస్, గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి అభ్యర్థిగా ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్, ఈసారి తమ పార్టీ కీలకనేత ఈటల రాజేందర్‌ను బరిలో దించిన బీజేపీ ఇలా మూడు పార్టీలూ మల్కాజిగిరిని చేజిక్కించుకునేందుకు హోరాహోరీ పోరాడాయి.

కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌లో ఆయనపై సిటింగ్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.పద్మారావు పోటీ చేశారు. బీఆర్ఎస్​కు బలమైన స్థానం మెదక్‌లో పోరు అత్యంత ఆసక్తికరంగా జరగడంతో ఈ ఫలితంపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 17 పార్లమెంట్​ స్థానాల్లో పలు చోట్ల ముఖాముఖి పోటీ జరగ్గా మరికొన్ని స్థానాల్లో ముక్కోణపు పోరు సాగింది. ఈ క్రమంలో గెలుపు తమదంటే తమదే అనే ధీమాతో పార్టీలు ఉన్నాయి.

అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే కౌంటింగ్ ప్రక్రియ - ఎలా జరుగుతుందో మీకు తెలుసా? - Vote Counting Process in India

మోదీ 3.0 vs ఇండియా కూటమి- కౌంటింగ్​కు అంతా రెడీ- నెహ్రూ రికార్డు సమం చేస్తారా? - lok sabha election results 2024

Last Updated : Jun 4, 2024, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.