ETV Bharat / politics

రాష్ట్రంలో జోరుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం - ఓట్ల వేటలో అభ్యర్థుల మాటల తూటాలు - Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024 : పోలింగ్‌ గడువు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, కార్నర్‌మీటింగ్‌లతో ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థులు మాటల తూటాలు పేలుతున్నాయి.

Election Campaign in Telangana 2024
Lok Sabha Elections 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 7:08 AM IST

రాష్ట్రంలో జోరుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం - ఓట్ల వేటలో అభ్యర్థుల మాటల తూటాలు (ETV BARATH)

Election Campaign in Telangana 2024 : సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నిజామాబాద్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి జగిత్యాల జిల్లా బండలింగాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, రామ్మోహన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. విశ్రాంతి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే రఘురామిరెడ్డిని గెలిపించాలని కోరారు.

Congress Election Campaign : మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొందరు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. చేరికను వ్యతిరేకరిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుమారున్ని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు జానా రెడ్డి కోరారు.

ఎలక్షన్ వార్ - ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల దూకుడు - lok sabha elections 2024

BJP Election Campaign 2024 : ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు సత్తుపల్లిలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బీజేపీలో చేరిన పలువురు ఇతర పార్టీ నేతలకు కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు. హైదరాబాద్ ముషీరాబాద్​లో జరిగిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ పాల్గొన్నారు. సికింద్రాబాద్​లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.

కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అబద్దాలతో గట్టెక్కాలని కాంగ్రెస్‌ చూస్తోందని బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం రిజర్వేషన్లు జోలికి వెళ్లదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకె అరుణ రోడ్‌షో నిర్వహించారు. ఆడవాళ్లను గౌరవించడం చేతగాని రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని విమర్శించారు.

BRS Election Campaign 2024 : సికింద్రాబాద్ గురుద్వారాలో మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రోడ్ షో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో ఇప్పుడు పాంచ్‌ న్యాయ్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెడుతోందని నామా ఆరోపించారు. ప్రచారానికి మరికొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

తెలంగాణలో ప్రచారం పరుగులు - సభలు, సమావేశాలు, రోడ్‌ షోలతో బిజీబిజీ - Lok Sabha Elections 2024

రాష్ట్రంలో రాజకీయ వే"ఢీ"- క్లైమాక్స్‌కు చేరుకున్న ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.