KTR Tweet On Power Cuts in Telangana : ప్రజలు ఆలోచించి ఈ నెల 13వ తేదీన ఓటు వేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలున్నాయన్న ఆయన, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ప్రత్యామ్నాయంగా కరెంటు పరికరాలను చేర్చారు. ప్రజలందరూ ఇన్వర్టర్లు, ఛార్జింగ్ లైట్లు, టార్చ్ లైట్లు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు సిద్ధంగా ఉంచుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరును ఎద్దేవా చేశారు. వాటిని మెన్షన్ చేస్తూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని, బీఆర్‌ఎస్ సర్కార్ కాదని ట్వీటారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు బీజేపీని కూడా విమర్శిస్తూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. డీ-మానిటైజేషన్ విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్‌కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని ప్రధాని మోదీ అన్నారని, ఆయన మాట ప్రకారం కాంగ్రెస్‌కి వాళ్లు అంతగా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు. మోదీకి ఇష్టమైన ఈడీ, సీబీఐలు స్కాంగ్రెస్ విషయంలో ఎందుకు మిన్నకుండి పోయాయని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసింది : కేటీఆర్ - KTR Comments on Congress Party
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరవు మొదలైందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. నీరులేక రైతులు పంట నష్టపోతున్నారని, 24 గంటల కరెంటు సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ తన బస్సు యాత్రల్లో కూడా కరెంటు కోతలపై మండిపడుతూనే ఉన్నారు. తను మహబూబ్‌నగర్‌లో పర్యంటించేటప్పుడు కరెంటు పోయిందంటూ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. రోజూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం అని అంటున్నారన్న ఆయన తనతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతుందని తనకు చెప్పారని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కరెంట్ కోతలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నారు. కావాలనే తమ పాలనపై ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ వేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరి ప్రత్యర్థుల ఆరోపణలకు సమాధానాలు చెబుతున్నారు. ప్రతినెల కరెంటు సరఫరాకు సంబంధించి వివరాలను వెల్లడిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గ సప్లై చేస్తున్నట్లు వివరిస్తున్నారు.
మాకు 12 సీట్లు ఇస్తే, గుంపు మేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - lok sabha elections 2024