KTR React on BRS Leaders Join in Congress : సాధారణంగా అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2004 నుంచి 2006 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో ఫిరాయింపులు జరిగాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమం ఉద్ధృతం చేయడం ద్వారా తెలంగాణ గట్టిగా ప్రతి స్పందించిందని స్పష్టం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. చరిత్ర పునరావృతం అవుతుందని తెలిపారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న వేళ ఈ మేరకు కేటీఆర్ "ఎక్స్" వేదికగా స్పందించారు.
'చరిత్ర పునరావృతం అవుతుంది' - ఫిరాయింపులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు - KTR React on Leaders Leaving - KTR REACT ON LEADERS LEAVING
KTR React on BRS Leaders Join in Congress : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న తరుణంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని తెలిపారు. గతంలో ప్రజా ఉద్యమం ఉద్ధృతంతో తెలంగాణ గట్టిగా ప్రతిస్పందించిందని గుర్తు చేశారు. చరిత్ర పునరావృతం అవుతుందని ఆయన ట్వీట్ చేశారు.
!['చరిత్ర పునరావృతం అవుతుంది' - ఫిరాయింపులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు - KTR React on Leaders Leaving KTR Reacts on BRS Leaders Leaving From Party](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-06-2024/1200-675-21781163-thumbnail-16x9-ktr.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 24, 2024, 10:38 AM IST