Lok Sabha Elections 2024 : మహాలక్ష్మీ పథకం అమలుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు 2వేల 500 రూపాయలు ఇస్తామని మోసం చేసినందుకు రేవంత్ నువ్వు చీర కట్టుకుంటావా? లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ. 2500 నగదు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని, ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు మహలక్ష్మి పథకం అడుగుతున్నారని పేర్కొన్నారు.
కిన్నెర మొగులయ్యతో కేటీఆర్ భేటీ - అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ - KTR meet Kinnera Mogulaiah
అధికారంలోకి రాగానే వంద రోజుల్లో గ్యారంటీలన్నీ అమలు చేస్తానని మాట తప్పినందుకు, కాంగ్రెస్‌ని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలేనని కేటీఆర్ దుయ్యబట్టారు. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యమని, చేసేదేమో సోనియమ్మ జపమన్నారు. మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ కిట్ ఆగిందని, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిందని, కల్యాణ లక్ష్మి నిలిచిందని, తులం బంగారం అడ్రస్ లేదని మండిపడ్డారు.
అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకమంతా బిల్డప్ అని, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు. పథకాలన్నింటిని అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప చేసిందేమి లేదని అందరికి తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు.
సిరిసిల్లలో కేటీఆర్, అవ్వ మధ్య ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్ - KTR conversation in Siricilla