ETV Bharat / politics

'మీకు ఇదే సరైన సమయమని గుర్తించండి' - కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లేఖ - KTR Letter to Bandi Sanjay

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 4:25 PM IST

MLA KTR Letter to MP Bandi Sanjay : బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, కేంద్రమంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ కస్టర్‌ను ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. రెండోసారి ఎంపీ కావటం, కేంద్రంలో మంత్రిగా కూడా పదవి దక్కటంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు ఇదే సరైన సమయమని గుర్తించాలని పేర్కొన్నారు.

KTR
KTR Letter to Bandi Sanjay (ETV Bharat)

KTR Letter to Bandi Sanjay : సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత పదేళ్లుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని, ఈ ప్రాంత ఎంపీగా ఐదేళ్ల క్రితం ఎన్నికయ్యారని, అయినా నేతన్నలకు ప్రతిసారి నిరాశే ఎదురైందని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.

సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకొచ్చేందుకు గత పదేళ్లుగా తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని కేటీఆర్ ఆక్షేపించారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అరుణ్ జైట్లీ వంటి అనేక మందిని స్వయంగా కలిసినా దక్కింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో సహకారం అందించాలని కోరినా, బండి సంజయ్ పట్టించుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. రెండోసారి ఎంపీ కావటం, కేంద్రంలో మంత్రిగా కూడా పదవి దక్కటంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు సరైన సమయమని గుర్తించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ కస్టర్‌ను ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్ మీద కక్షతో నేతన్నల ఉసురు తీయవద్దు - బతుకమ్మ చీరల ఆర్డర్లపై కేటీఆర్ - KTR Reaction on Bathukamma Sarees

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఉపాధి లేక ఇక్కడి కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సంగతి గుర్తించాలని బండి సంజయ్‌కు సూచించారు. గత ప్రభుత్వం నేతన్నల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కారు పాతరేయడంతో చేనేత రంగం మరోసారి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్న కీలక సమయంలో వారిని ఆదుకునే మంచి అవకాశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉందని గుర్తు చేశారు.

సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని, చేతినిండా పని దొరికి మళ్లీ ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు సిరిసిల్ల ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని, నేతన్నలు, చేనేతలను ఆదుకోవటానికి గత పదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోవటం దురదృష్టకరం, బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వనరులు లేని రాష్ట్రాలకు సైతం కేంద్రం అనేక రకాల ప్రాజెక్టులను మళ్లిస్తోందని, అన్ని సానుకూల అంశాలు ఉన్న సిరిసిల్లకు మేలు జరిగే దిశగా బండి సంజయ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ గొంతు పార్లమెంటులో లేదనే - సింగరేణి ప్రైవేటీకరణకు ఆ రెండు పార్టీల కుట్ర : కేటీఆర్​ - KTR on Singareni Coal Mines

ప్రకటన చేయిస్తారని ఆశిస్తున్నా : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రాధాన్యత, దాని వల్ల జరిగే లబ్దిని వారి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కేటీఆర్ కోరారు. గత ఐదేళ్లలో కరీంనగర్‌కు గానీ, సిరిసిల్ల నేతన్నలకు గానీ బండి సంజయ్ పదవీకాలంలో జరిగిన ప్రయోజనం ఏమీ లేదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఎంపీలు మాత్రం తమ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేసి తమ ప్రాంతాలకు నిధులు, పరిశ్రమలను తరలించుకుపోతున్నారని, తెలంగాణ ప్రజలు రెండోసారి ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కచ్చితంగా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రకటన చేయిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా? - సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ - KTR LETTER TO CM REVANTH REDDY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.