ETV Bharat / politics

కారు వదిలి ఆటోలో ప్రయాణించిన కేటీఆర్ - KTR Travel on Auto Video

KTR Going to Telangana Bhavan on Auto : యూసఫ్‌గూడ నుంచి తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. ట్రాఫిక్‌జామ్‌ కావడంతో ఆటోలో రావాల్సి వచ్చిందని తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నాని పేర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

KTR Travel on Auto
KTR Auto Video
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 3:07 PM IST

Updated : Jan 27, 2024, 3:47 PM IST

KTR Going to Telangana Bhavan on Auto : రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తామని, వారికి అండగా నిలుస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(BRS Leader KTR) తెలిపారు. యూసఫ్ గూడలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన తెలంగాణ భవన్​కు ఆటోలో వచ్చారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆటోలో రావాల్సి వచ్చిందని చెప్పారు. అదే సమయంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు కూడా అడిగి తెలుసుకున్నానని తెలిపారు.

కారు వదిలి ఆటోలో ప్రయాణించిన కేటీఆర్

బీఆర్ఎస్​కి కార్యకర్తలే కథానాయకులు - వారే పార్టీకి ధైర్యం చెప్పారు : కేటీఆర్

KTR Travel on Auto Video : చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆటో డ్రైవర్ కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రభుత్వం తమకు రీయంబర్స్ చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్ కోరినట్లు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కేసీఆర్ దృష్టికి కూడా తమ సమస్యలు తీసుకెళ్లాలని కేటీఆర్​ను కోరినట్లు ఆటో డ్రైవర్ రమేష్ వివరించారు.

"ట్రాఫిక్‌జామ్‌ కావడంతో ఆటోలో రావాల్సి వచ్చింది. దారిలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు తెలుసుకున్నాను. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని చెప్పారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తెస్తాం."- కేటీఆర్, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

KTR Latest Comments on Congress : ఓవైపు ట్రాఫిక్​ నియంత్రణపై జూబ్లీహిల్స్​లోని పోలీస్ కమిషనరేట్​లో సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతున్న వెళ్ల.. కేటీఆర్​ ట్రాఫిక్​ జామ్​లో చిక్కుకొని ఆటోలో ప్రయాణించడం ఆసక్తిగా మారింది. అనంతరం తెలంగాణ భవన్​లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్​ క్లీన్​స్వీప్​ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్‌కు అప్పగించామని అన్నారు. హామీలు అమలవ్వాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్ఎస్​ కార్యకర్తల సమావేశంలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 14 అసెంబ్లీ స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని, కొన్ని జిల్లాల్లో మాత్రమే అనుకున్న ఫలితాలు రాలేదని కార్యకర్తలకు ప్రేరణ కలిగించారు.

నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో నాడు కనిపించిన రాజకీయ నేపథ్యం నేడు కనిపించలేదా? : కేటీఆర్
45 రోజుల పాలనలో దిల్లీ పర్యటనలు మినహా సీఎం రేవంత్ సాధించింది ఏమీ లేదు : కేటీఆర్

Last Updated : Jan 27, 2024, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.