ETV Bharat / politics

సీఎం రేవంత్​ రెడ్డితో కేకే మర్యాదపూర్వక భేటీ - ఇక చేరికే తరువాయి - K KESHAVA RAO MEETS CM REVANTH - K KESHAVA RAO MEETS CM REVANTH

KK Meets CM Revanth Reddy Today : బీఆర్​ఎస్​ ఎంపీ కె.కేశవరావు సీఎం రేవంత్​ రెడ్డితో సమావేశమయ్యారు. కాంగ్రెస్​ పార్టీలో చేరతానని గురువారం ప్రకటించిన ఆయన, హైదరాబాద్​ డీసీసీ అధ్యక్షుడు రోహిన్​రెడ్డితో కలిసి నేడు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.

KK_Meets_CM_Revanth_Reddy_Today
KK_Meets_CM_Revanth_Reddy_Today
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 1:40 PM IST

KK Meets CM Revanth Reddy Today: తెలంగాణలో లోక్​సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్​లోకి చేరికల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హస్తం కండువా కప్పుకోగా, బీఆర్​ఎస్​ కీలక నేతలు కె.కేశవరావు, కడియం శ్రీహరి, తమ కుమార్తెలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ ఎంపీ కె. కేశవరావు సమావేశమయ్యారు.

జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్​ మున్షీతో కలిసి రేవంత్​తో భేటీ అయ్యారు. ఇటీవల దీపాదాస్​ మున్షీ కేకే నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె ఆహ్వానం పట్ల సుముఖత వ్యక్తం చేసిన ఆయన, గురువారం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్​తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని కేకేకు కేసీఆర్ చెప్పినా, తాను పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లుగా కేకే చెప్పినట్లుగా తెలిసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి త్వరలోనే కాంగ్రెస్​లో చేరనున్నట్లుగా చెప్పినట్లుగా సమాచారం. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో చేరనున్నట్లుగా సమాచారం. చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కేకే పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పీసీసీగా పని చేసిన అనుభవం, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో సైతం కేకేకు సముచిత స్థానం లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని అంశాలపై కేకే ఇవాళ మధ్యాహ్నం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

42వ వసంతంలోకి టీడీపీ - పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపిన చంద్రబాబు - TDP Formation Day Celebrations

BRS MP KK To Join Congress : ఈ నెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్టు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని, అందుకే కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. విజయలక్ష్మి తండ్రి, సీనియర్‌ నేత కేకే సైతం కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకుంటున్నట్టు గురువారం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సీఎంతో భేటీ అయ్యారు. మరోవైపు కేకే కుమారుడు విప్లవ్‌ కుమార్‌ మాత్రం, తాను బీఆర్​ఎస్​లోనే కొనసాగనున్నట్టు చెప్పారు. తన తండ్రి, సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నారు.

గ్రేటర్​లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం : గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేయడానికి అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అనేక పురపాలక సంఘాలు, నగరపాలక సంఘాల పరిధిలో గత ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులు గెలిచినా, చాలా చోట్ల వీరంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో పాలకవర్గాలన్నీ కాంగ్రెస్‌ చేతికి వస్తున్నాయి. ఇదే విధంగా బల్దియాలో కూడా అధిక శాతం కార్పొరేటర్లను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా ఎంఐఎం తోడ్పాటుతో హస్త గతం చేసుకోవాలని పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా మేయర్​ విజయలక్ష్మితో ఇటీవల జరిపిన చర్చలు సఫలం కావడంతో, శనివారం ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆమె వెంట 5 నుంచి 10 మంది కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌లో చేరతారని నేతలు చెబుతున్నారు.

మే 13న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూలదోస్తారు- జగన్​ నాటకాలు హాలీవుడ్​నే తలదన్నేలా ఉన్నాయి: చంద్రబాబు - Chandrababu Election Campaign

పక్కా ప్లాన్​తో గేట్లెత్తారు : గత బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఇద్దరే కార్పొరేటర్లు గెలిచారు. ఇటీవల పరిణామాలతో కొందరు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బల్దియాలో ఆ పార్టీ బలం 10కి చేరింది. మరో 30 మంది కార్పొరేటర్లను చేర్చుకోవాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరితే డివిజన్లలో పెద్ద ఎత్తున పనులు చేయించొచ్చన్న భావనలో కొందరు బీజేపీ, బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్‌ అగ్ర నేతలు భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే మేయర్‌ విజయలక్ష్మితో కాంగ్రెస్‌ పెద్దలు మాట్లాడారు. పార్టీలో చేరడానికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్‌ శ్రీలత హస్తం గూటికి చేరారు. ఇప్పుడు వీరిద్దరు కాంగ్రెస్‌ ఆపరేషన్‌లో భాగం కానున్నారని చెబుతున్నారు. మరో 2 వారాల్లో మరింత మంది కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్​ఎస్​ పార్టీకి అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యూహం రూపొందించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.