ETV Bharat / politics

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతుంది: కిషన్‌రెడ్డి

Kishan Reddy Fire on Congress Party : కాంగ్రెస్​కు ఓటు వేస్తే దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతుందని, రాష్ట్రంలో బీఆర్​ఎస్​​కు ఓటు వేయాల్సిన అవసరమే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారని కేంద్రమంత్రి ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో కాషాయ పార్టీ సిద్ధమవుతూనే, పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలను ఆహ్వానిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు కాషాయ కండువా కప్పుకున్నారు.

BJP Focus On Parliament Elections 2024
Kishan Reddy Fire on Congress Party
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 8:39 PM IST

Kishan Reddy Fire on Congress Party : కాంగ్రెస్​కు ఓటు వేస్తే దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతోందని, రాష్ట్రంలో బీఆర్​ఎస్​​కు ఓటు వేయాల్సిన అవసరమే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారని కేంద్రమంత్రి ధ్వజమెత్తారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో కాషాయ పార్టీ సిద్ధమవుతూనే, పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలను ఆహ్వానించారు.

చేరికలు, బస్సు యాత్రలు, నారీ శక్తి వందన్​తో ప్రజల్లోకి - ఫిబ్రవరి నెలంతా బీజేపీ బిజీబిజీ

ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు, కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం మాట్లాడిన కేంద్రమంత్రి, భారత్‌ను 2047నాటికి పేదరికం లేని దేశంగా, అభివృద్ది చెందిన దేశంగా నిర్మించుకుందామని తెలిపారు. మెజార్టీ పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదు ఇచ్చిన హామీలు అమలు చేసేదిలేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) ఓటు వేయాల్సిన అవసరంలేదని, ఆ పార్టీ తెలంగాణకు అవసరం లేదన్నారు.

BJP Target On Huge Parliament Seats : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో ఉగ్రవాదం పెరిగిందని, ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలైందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి చేరుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్(Etala Rajender) తెలిపారు. పార్టీలోకి వచ్చిన వారందరికి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఎగరబోయేది కాషాయ జెండా అన్నారు.

విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్చిన్నం అవుతోంది : కిషన్​రెడ్డి

"వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఆ పార్టీని గుర్తించాల్సిన అవసరం అంతకంటే లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసిన దేశంలో అస్థిరత, అవినీతి, కుటుంబ పాలనకు, ఉగ్రవాదానికి పెంచి పోషించడమే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు మన దేశంలో అధికారంలోకి ఉంటే అప్పుడే ఉగ్రవాదం పెరిగింది."-కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

BJP Focus On Parliament Elections : 2024 పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి రికార్డు సృష్టించడం ఖాయమన్న కేంద్రమంత్రి, రాష్ట్రంలో సైతం పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు సమాలోచనలు చేశారు. ఫిబ్రవరి నెలంతా నాయకులు, కార్యకర్తల ముందు పెద్ద లక్ష్యాన్నిపెట్టి ఉంచారు. అందుకు తగ్గట్టుగా పార్టీ నిత్యం ప్రజల్లో బిజీబిజీగా ఉండేలా కార్యక్రమాలను రూపొందించింది.

ఒకవైపు చేరికలతో పాటు మరో వైపు బస్సు యాత్రలతో(BJP Bus Trip) పార్టీకి ఊపు తీసుకురావాలని వ్యూహాలు రచించింది. బీఆర్​ఎస్​, కాంగ్రెస్ పార్టీ​లో అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో సైతం పార్టీ చేరికలను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే దేశంలో అస్థిరత, అవినీతి పెరుగుతుంది: కిషన్‌రెడ్డి

బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధి శూన్యం - కాంగ్రెస్​ అయినా చేసి చూపించాలి : కిషన్​రెడ్డి

రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి - ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి : కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.