ETV Bharat / politics

నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్​ - KCR to Take oath as MLA on Feb 1

KCR to Take oath as MLA in Assembly on Feb 1 : గజ్వేల్​ ఎమ్మెల్యేగా బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శాసనసభాపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత కొన్ని రోజుల క్రితం కేసీఆర్​ కాలు జారి పడడంతో, ఆయనకు తుంటి ఎముక శస్త్రచికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఆయన శాసనసభ సమావేశాలకు హాజరు కాలేకపోయారు.

KCR to Take oath as MLA in Assembly on February 1
రేపు గజ్వేల్​ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్​
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 5:22 AM IST

KCR to Take oath as MLA in Assembly on February 1 : గజ్వేల్ శాసనసభ్యునిగా భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శాసనసభాపతి సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్, గజ్వేల్​లో గెలుపొంది కామారెడ్డిలో పరాజయం పాలయ్యారు. గత కొన్ని రోజుల క్రితం తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో కాలు జారి పడడంతో ఆయన తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేశారు. ఈ కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ప్రస్తుతం కోలుకుంటున్న ఆయన, వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో నడుస్తున్నారు.

BRS Leader KCR Sworn as Gajwel MLA : రేపు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సమక్షంలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు కేసీఆర్ లాబీల్లో ఉన్న ప్రతిపక్ష నేత ఛాంబర్​లో పూజలు చేస్తారు. అనంతరం సభాపతి ఛాంబర్​లో శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభ్యునిగా కేసీఆర్ ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

1985 నుంచి 1999 వరకు సిద్దిపేట నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుపొందిన బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​, 2001 ఉపఎన్నికతో పాటు 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే అప్పుడు ఎంపీగా(MP) కూడా గెలుపొందడంతో శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అనంతరం 2014, 2018తో పాటు ఇటీవలి ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పటి వరకు మంత్రిగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కేసీఆర్, ఇపుడు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Parliament Elections 2024 : మరోవైపు పార్లమెంట్‌లో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలని రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలని పార్టీ ఎంపీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మూడు రోజుల క్రితం ఎర్రవల్లిలోని(Erravalli) కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంగా సమావేశం నిర్వహించిన ఆయన​, రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎసే అని అన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడాల్సిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్‌ రెడ్డి

నోటీసులు నాకు ఎందుకు, కోమటిరెడ్డికి పంపండి : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.