ETV Bharat / politics

కాకినాడలో లంగరు వేసేదెవరో ? - ఆసక్తికరంగా లోక్​సభ పోరు - Kakinada LOK SABHA ELECTIONS

Kakinada Lok Sabha Constituency: కాకినాడ కాజా అంటే తెలియని తెలుగువాళ్లు ఉండరు. నాటి కొరింగా నేటి కాకినాడ. భారతదేశంలో రెండో అతి పెద్ద మడ అడవులు కాకినాడకి అగ్నేయంగా ఉన్నాయి. కోరింగ అభయారణ్యం ఇక్కడే. గోదావరి నదీ పాయ 'గౌతమి' కాకినాడకు దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తుంది. బకింగ్​హాం కాలువ, విశాఖ తర్వాత రెండో అతి పెద్ద ఓడరేవు కాకినాడ నగరంలో ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురుహూతికా అమ్మవారి ఆలయం కాకినాడకు సమీపంలోని పిఠాపురంలో ఉంది.

Kakinada_Lok_Sabha_Constituency
Kakinada_Lok_Sabha_Constituency
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 1:05 PM IST

Kakinada Lok Sabha Constituency: కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరిలోనే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి చెందిన చలమలశెట్టి సునీల్‌పై వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్‌ 25వేల 738ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సునీల్‌కు 42.04 శాతం ఓట్లు రాగా గీత 44.16 శాతం ఓట్లు రాబట్టుకున్నారు.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఈ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభా నియోజవర్గాలు ఉన్నాయి.

  1. తుని
  2. ప్రత్తిపాడు
  3. పిఠాపురం
  4. కాకినాడ
  5. పెద్దాపురం
  6. కాకినాడ పట్టణం
  7. జగ్గంపేట

అసెంబ్లీ స్థానాలన్నీ జనరల్‌ కేటగిరిలోవే కావడం గమనార్హం.

2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు:

  • మొత్తం ఓటర్ల సంఖ్య- 15.99 లక్షలు
  • ఓటర్లలో పురుషుల సంఖ్య- 7.88 లక్షలు
  • మహిళా ఓటర్ల సంఖ్య- 8.10 లక్షలు
  • ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య- 179

ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే: పొత్తులో భాగంగా ఈ లోక్​సభ నియోజకవర్గం జనసేనకు కేటాయించగా ఈ పార్టీ నుంచి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్​ను పార్టీ అధిష్ఠానం బరిలో దించింది. చలమలశెట్టి సునీల్ ఈ లోక్​సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మరోసారి సీటు దక్కించుకుని పోటీలో నిలిచారు. వైఎస్సార్సీపీ కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా ఈయన నాలుగోసారి బరిలో దిగుతున్నారు. పారిశ్రామికవేత్త అయిన సునీల్‌కు కాకినాడ నగరంతో పాటు, మెట్ట ప్రాంత నియోజకవర్గాలతో సాన్నిహిత్యం, బంధుత్వాలతో బలమైన అనుబంధం ఉంది. 2004, 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి, కేంద్ర మంత్రిగానూ పనిచేసిన అనుభవం సునీల్​కు ఉంది.

Kakinada_Lok_Sabha_Constituency
ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు

ఇక కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు బరిలో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండల కేంద్రానికి చెందిన ఉదయ్‌ శ్రీనివాస్‌ 'టీ టైం' సంస్థ అధినేత. ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆయన సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేశారు. దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి స్వదేశానికి వచ్చారు. దేశీ టీ టైం స్టాల్స్‌ శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. 3,300 శాఖల వరకు ఉన్నాయి.

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే:

  • 1952 - చెలికాని. వెంకట రామారావు(సీపీఐ)
  • 1957 - బయ్య. సూర్యనారాయణ మూర్తి(కాంగ్రెస్‌)
  • 1962 - మొసలిగంటి. తిరుమల రావు(కాంగ్రెస్‌)
  • 1967 - మొసలిగంటి. తిరుమల రావు(కాంగ్రెస్‌)
  • 1971 - ఎం.ఎస్‌. సంజీవి రావు(కాంగ్రెస్‌)
  • 1977 - ఎం.ఎస్‌. సంజీవి రావు(కాంగ్రెస్‌)
  • 1980 - ఎం.ఎస్‌. సంజీవి రావు(కాంగ్రెస్‌[ఐ])
  • 1984 - తోట. గోపాల కృష్ణ(టీడీపీ)

ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:

  • 1989 - ఎం.ఎం. పల్లం రాజు(కాంగ్రెస్‌)- తోట గోపాలకృష్ణ(టీడీపీ)
  • 1991 - తోట. సుబ్బారావు(టీడీపీ)- మల్లిపూడి మంగపతి పళ్లంరాజు(కాంగ్రెస్)
  • 1996 - తోట. గోపాలకృష్ణ(టీడీపీ)- తోట సుబ్బారావు(కాంగ్రెస్)
  • 1998 - కృష్ణంరాజు(బీజేపీ)- తోట గోపాలకృష్ణ(టీడీపీ)
  • 1999 - ముద్రగడ పద్మనాభం(టీడీపీ)- తోట సుబ్బారావు(కాంగ్రెస్)
  • 2004 - ఎం.ఎం.పల్లంరాజు(కాంగ్రెస్‌)- ముద్రగడ పద్మనాభం(టీడీపీ)
  • 2009 - ఎం.ఎం.పల్లంరాజు(కాంగ్రెస్‌)- చలమలశెట్టి సునీల్(ప్రజారాజ్యం పార్టీ)
  • 2014 - తోట.నరసింహం(టీడీపీ)- చలమలశెట్టి సునీల్(వైఎస్సార్సీపీ)
  • 2019 - వంగా గీత(వైఎస్సార్సీపీ)- చలమలశెట్టి సునీల్(టీడీపీ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.