ETV Bharat / politics

అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం- ఇప్పుడు కోడిగుడ్డు! గుర్తుకువస్తోంది: పవన్‌ - Varahi Vijayabheri Meeting - VARAHI VIJAYABHERI MEETING

PAWAN KALYAN VARAHI VIJAYABHERI MEETING: అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకువస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్​ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పవన్, వైసీపీ విమర్శలపై సూటిగా స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యమని అన్నారు. జగన్ సీఎం కాదని ఒక సారా వ్యాపారి, ఇసుక దోపిడీదారని విమర్శించారు.

Varahi_Vijayabheri_Meeting
Varahi_Vijayabheri_Meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 10:47 PM IST

PAWAN KALYAN VARAHI VIJAYABHERI MEETING: ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్​ పాల్గొని ప్రసంగించారు. అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సి.ఎం.రమేశ్‌, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్ తరఫున పవన్ కల్యాణ్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్‌ ఒక సీఎం కాదని సారా వ్యాపారి, ఇసుక దోపిడీ దారు అని పవన్ కల్యాణ్​ ధ్వజమెత్తారు. అనకాపల్లి అంటే ఒకప్పుడు అందరికీ బెల్లం గుర్తొచ్చేదని కానీ, ఇప్పుడు అనకాపల్లి అంటే కోడి గుడ్డు పేరు వింటున్నామని పవన్ కల్యాణ్​ అన్నారు.

కోడి గుడ్డు పెట్టిందని అది ఇంకా పొదుగుతూనే ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ కోడి ఈ జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను, ఐదు పోర్టుఫోలియోలకు మంత్రిని, ఒక విప్‌ను ఇచ్చిందని కానీ, ఒక్క కిలోమీటరు రోడ్డు కూడా వేయలేకపోయిందంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి పవన్‌ విమర్శించారు.

తాను ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, మంత్రి పదవి కోరుకుంటే తనకు ఎప్పుడో వచ్చేదని అన్నారు. రాజకీయ పార్టీని నడపటం అంటే అంత సులభం కాదని పవన్ పేర్కొన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్దకాలం పాటు పార్టీని నడపడం అంత సులభం కాదని తెలిపారు. అయినా సరే, ప్రజల భవిష్యత్తు బాగుండాలనే ఆకాంక్షతోనే పనిచేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

మరోసారి కలసికట్టుగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రచారం-శ్రేణుల్లో ఉత్సాహం - Chandrababu and Pawan Campaign

ఈరోజు ఎక్కడికి వెళ్లినా తనకు అశేష ప్రజాభిమానం ఉందని, ఇంత ప్రజాభిమానాన్ని తమ పార్టీకే సొంతం చేసుకోవాలన్న స్వార్థం ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ, స్వార్థాన్ని దాటి మీకోసం వచ్చానని, కూటమి ప్రభుత్వం రావాలంటే ఒక్క తప్పు కూడా జరగకూడదని పిలుపునిచ్చారు. అన్ని శక్తులు కలవాలని, అందుకే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలతో సరిపెట్టుకున్నామని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన పార్టీది అయినప్పటికీ కేంద్ర నాయకత్వం అభ్యర్థన మేరకు వదులుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ కోరారు.

అమ్మఒడి పథకానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏటా కోతలు పెట్టుకుంటూ వచ్చారన్న పవన్‌, తుమ్మపాలెం చక్కెర పరిశ్రమ తెరిపిస్తామని చెప్పి అమ్ముతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాగానే ముందుగా చెత్తపన్ను రద్దు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ పర్యాటకులు వచ్చేలా అనకాపల్లి అభివృద్ధి చెందాలని తెలిపారు. శారద నది తీరాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

తాను సాధారణ ఉద్యోగి కుమారుడిని అన్న పవన్‌ కల్యాణ్‌, ఉద్యోగులకు పింఛను ఎంత ముఖ్యమే తనకు తెలుసని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్‌కు ఒక పరిష్కారం చూపుతామని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కిరాయి మూకలు నన్ను, నా సిబ్బందినీ బ్లేడుతో కోస్తున్నారు: పవన్‌కల్యాణ్‌ - Pawan kalyan comments on YSRCP

అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేది - ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకువస్తోంది: పవన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.