ETV Bharat / politics

వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు కూడగట్టిన పవనిజం - ఏపీ రాజకీయాల్లో 'పవర్' స్టార్ - game changer in ap politics

Pawan Kalyan Politics : క్లిష్ట పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అరాచక రాజ్యాన్ని కూల్చాలంటే వ్యక్తిగత అజెండాలు, పార్టీల జెండాలు పక్కన పెట్టి కూటమి కట్టాల్సిందేనని పట్టుబట్టారు. పొత్తు ధర్మానికి నిలబడి కొన్ని సీట్లూ త్యజించారు! హలో ఏపీ బైబై వైసీపీ అనే నినాదంతో కూటమిని ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతిమంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 12:10 PM IST

pawan_kalyan_politics
pawan_kalyan_politics (ETV Bharat)

Pawan Kalyan Politics : ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు! సినిమాలో చెప్పిన ఈ డైలాగ్‌నే రాజకీయాల్లో ఆచరించి చూపాడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌! అటు వ్యక్తిగతంగా, ఇటు పార్టీపరంగా క్లిష్ట పరిస్థితులు ఎదురైన దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ అరాచక రాజ్యాన్ని కూల్చాలంటే వ్యక్తిగత అజెండాలు, పార్టీల జెండాలు పక్కన పెట్టి కూటమి కట్టాల్సిందేనని పట్టుబట్టారు. వైఎస్సార్సీపీ ఎన్నికుటిల ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగత దూషణలకు దిగినా, కాపు నేతల్లో చీలికలు తేవాలని చూసినా పొత్తు ధర్మానికి నిలబడ్డారు. తప్పదనుకున్నప్పుడు కొన్ని సీట్లూ త్యజించారు! హలో ఏపీ బైబై వైసీపీ అనే నినాదంతో కూటమిని ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతిమంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

2022 మార్చి 14! గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ! ఓవైపు వెర్రితలలు వేస్తున్న వైఎస్సార్సీపీ అరాచక రాజకీయాలు! మరోవైపు సీఎం సీఎం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జనసైనికుల నినాదాలు! జనసేనాని ఏం చెప్తారు.? కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారనే ఉత్కంఠ! ఆ సమయంలో ఆయన చెప్పిన ఒకేఒక్క మాట రాష్ట్రంలో కూటమికి నాంది పలికింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే లేదని చెప్పిన మాట అప్పటి వరకూ ఉన్న రాజకీయాలను మలుపు తిప్పింది. వైనాట్‌ 175 అంటూ వైఎస్సార్సీపీ వేసుకున్న లెక్కల్ని తారుమారు చేసి రాష్ట్రంలో అధికార మార్పిడికి బాటలు వేసింది.

పిఠాపురం ప్రజల ఆప్యాయత, సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్‌ కల్యాణ్ - Pawan Kalyan Thankful for Polling

పవన్ ప్రకటన చేసినప్పటి నుంచీ వైఎస్సార్సీపీ గంగవెర్రులెత్తింది! విపక్షాలన్నీ ఏకమైతే తమ అధికారం గల్లంతేననే బెంగపడింది. అప్పటి నుంచి పవన్‌పై ముప్పేట దాడికి దిగింది. సినిమా ప్రదర్శనకు ఆంక్షలు, పవన్‌ పర్యటనలకు అడ్డంకులు, అడుగు బయటపెట్టనీయకుండా పోలీసుల కాపలాలు, చివరకు అభిమానులకు అభివాదం కూడా చేయొద్దనే వరకూ వెళ్లడం, వైఎస్సార్సీపీ కాపు నాయకులతో రోజూ తిట్టించడం, పావలా కల్యాణ్‌ అంటూ హేళన చేయడం నిత్యకృత్యమైంది. చివరకు పవన్‌కు తిక్కంటూ నోరుపారేసుకున్నారు. ఐతే నా తిక్కకూ ఓ లెక్కుందంటూ పవన్‌ ఎప్పటికప్పుడు వైఎస్సార్సీపీ నాయకుల విమర్శల్ని గట్టిగానే తిప్పికొడుతూ వచ్చారు. వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పించాలనే యజ్ఞంలో ఇవన్నీ పట్టించుకోకూడదని దీక్షపూనారు. పార్టీ శ్రేణులనూ ఆ విధంగానే సమాయాత్తం చేస్తూ వచ్చారు! చివరకు చంద్రబాబు అరెస్టు సమయంలోపొత్తుపై ప్రకటన చేశారు. జైలులో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చి తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అక్కడే స్పష్టం చేశారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననే పవన్ ప్రకటన ప్రకారం వైఎస్సార్సీపీ మినహా మిగతాపార్టీలు ఏకతాటిపైకి రావాలి. పవన్ అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకున్న బీజేపీ మళ్లీ కూటమి అంటే ఒప్పుకుంటుందా అనే సందేహం! ఆ సమయంలో బీజేపీ నుంచీ పవన్‌కు కొన్ని ఇబ్బందులు తప్పలేదు. కానీ, జనసేనాని అవేమీ ఆలోచించలేదు. ఏపీలో దోపిడీ రాజ్యం పోవాలంటే చేతులు కలపాల్సిందేనని పట్టుబట్టారు. కూటమి కట్టే వరకూ ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ వెళ్లారు. బీజేపీ పెద్దలు మొదట్లో అంత ఆసక్తి చూపకపోయనా పొత్తు అవసరాన్ని, జగన్ వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పవన్‌ విడమర్చి చెప్పుకుంటూ వెళ్లారు. చివరకు మెప్పించారు. పొత్తుకు ఒప్పించారు.పొత్తులో పవన్‌ ఎక్కడా రాజకీయ స్వార్థం ప్రదర్శించలేదు! పరిణతితో వ్యవహరించారు. జనసేన బలం, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి పవన్ 40నుంచి 50సీట్లు అడుగుతారని అంతా భావించారు. ఐతే ఈసారి ఎన్నికల పొత్తుల్లో పంతాల కంటే ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు జనసేనాని! అందుకే మొదట్లో 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లకు అంగీకరించారు! కూటమిలో బీజేపీ చేరడం, వారి నుంచి సీట్ల డిమాండ్ పెరిగేసరికి తన కోటాలో త్యాగం చేశారు. 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ సీట్లతో సరిపెట్టుకున్నారు. చివరకు తన సోదరుడు నాగబాబుని అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీ చేయించాలనే నిర్ణయాన్నీ ఉపసంహరించుకున్నారు.

రాష్ట్రంలో కూటమిదే అధికారం- మోదీ నామినేషన్​లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ - Modi nomination

సొంత అన్న సీటునే త్యాగం చేయటం ద్వారా జనసేన నేతలకు పొత్తు అవసరంపై విస్పష్ట సంకేతాలు పంపారు. సీట్లు తీసుకోవటం గొప్పకాదని, గెలవడం ముఖ్యమని చెప్పారు. ఓడిపోయి వైఎస్సార్సీపీ నేతలతో మాటలు పడేకన్నా గెలిచి, వాళ్ల నోటికి తాళం వేద్దామని జనసైనికుల్నికార్యోన్ముఖుల్నే చేశారు. పొత్తును విచ్ఛిన్నం చేయాలని వైఎస్సార్సీపీ తుదకుంటూ ప్రయత్నించినా పవన్‌ తాను గీసుకున్న గీత దాటలేదు. వైఎస్సార్సీపీ నాయకులు పవన్‌ను అడుగడుగునా చులకన చేసేందుకు యత్నించారు. కూటమి గెలిస్తే పవన్‌ను ఏమైనా ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ తలతిక్క ప్రశ్నలు వేశారు! ప్యాకేజ్‌ తీసుకుని జనసేనను తాకట్టు పెట్టారంటూ కార్యకర్తల్ని ఉసిగొల్పారు. పవన్‌ దేనికీ అదరలేదు. ఇక లాభం లేదనుకున్న వైఎస్సార్సీపీ మరోవైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేసింది. పవన్ వెంట ఉన్న హరిరామజోగయ్య వంటి కాపునేతల్ని ఎగదోసింది. సగం సీట్లు అడగాలంటూ జోగయ్య వంటి వారితో ఒత్తిడి తెప్పించారు. ఇక కాపు ఉద్యమనేతగా చేప్పుకునే ముద్రగడ్డ పద్మనాభాన్నీ పార్టీలో చేర్చుకుని ఉసిగొల్పారు. పవన్‌ను ఓడిస్తానని లేకపోతే తన కులం పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా మారతానని ముద్రగడ సవాల్ విసిరారు. కానీ పవన్ ఎక్కడా పంతాలకు పోలేదు. సంయమనం పాటించారు. స్థితప్రజ్ఞతతో సొంత సామాజికవర్గం నుంచి వచ్చిన ఒత్తిళ్లను అధిగమించారు. కూటమి ఏర్పాటులోగానీ, సీట్ల సర్దుబాటులోనూ ఏనాడూ పునరాలోచన చేయలేదు. జనసైనికుల్లో ఎక్కడైనా చిన్న అసంతృప్తి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే ఏదైనా అని వారికి సర్దిచెప్పారు. ఎన్నికల సమయానికి అందరూ సర‌్దుకుపోయేలా చేశారు. జనసేన ఓటు తెలుగుదేశం, బీజేపీలకు బదిలీ కావాల్సిందేనని నిర్దేశించారు.

జనసేన ప్రస్థానం పదేళ్లు! అధికారం అనుభవించలేదు! కనీసం విపక్షంలోనూ లేదు. ఐనా పవన్ కల్యాణ్ ఛరిష్మా.. ఆ పార్టీ ఉనికికి పెట్టనికోటలా నిలిచింది. ప్రజల కోసం నిలబడటం, అన్యాయంపై గొంతెత్తడం, అరాచకాన్ని నిలదీయటం, దౌర్జన్యాల్ని ఎదిరించటం వంటివన్నీ పవన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. జగన్ తప్పిదాల్ని నిలదీయడంలో పవన్ ఎక్కడా రాజీపడలేదు. చివరకు తన వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకర దాడికి దిగినా బెదరలేదు. జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తన ధ్యేయం అనుకున్నారు. అవసమైన ప్రతీసారీ పట్టువిడుపులు ప్రదర్శించారు. జనం కోసం జగన్ వ్యతిరేక శక్తుల్ని ఒకేతాటిపైకి తెచ్చి కూటమి విజయం సాధించటంలో తనదైన పాత్ర పోషించారు. కాపుల ఓట్లు చీలకుండా కూటమికే పడేలా చూశారు.

అన్ని వర్గాలు వైఎస్సార్సీపీని భూస్థాపితం చేస్తాయి: పవన్ - JANASENA PAWAN KALYAN INTERVIEW

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.