ETV Bharat / politics

పవన్​కు ఎన్ని కార్లు ఉన్నాయంటే!- వాటి ధరెంతో తెలుసా? - pawan kalyan nomination - PAWAN KALYAN NOMINATION

pawan kalyan cars : జనసేన అధ్యక్షుడు, పవర్​ స్టార్​ పవన్​ కళ్యాణ్​ పేరిట ఉన్న కార్లు ఎన్ని? వాటి ధర ఎంతో తెలుసా? ఎన్నికల నామినేషన్​ సందర్భంగా పవన్​ వెల్లడించిన ప్రకారం ఆయన వద్ద 9 కార్లున్నాయి. అందులో ఆరింటిని 2022 సంవత్సరంలో కొనుగోలు చేశారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

pawan_kalyan_vehicles
pawan_kalyan_vehicles
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 4:08 PM IST

Updated : Apr 23, 2024, 4:35 PM IST

pawan kalyan cars : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముందుగా నామినేషన్​ దాఖలు చేయాల్సిందే. తమపై నమోదైన కేసులు, ఆస్తుల పూర్తి వివరాలను అందులో వెల్లడించాల్సిందే. ఈ నేపథ్యంలో వేల కోట్లు కలిగిన పలువురు అభ్యర్థుల ఆస్తుల వివరాలు తెలిసి ఓటర్లు అవాక్కవుతున్నారు. కాగా, కూటమి అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్​ కళ్యాణ్ ఇవాళ నామినేషన్​ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనపేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల కమిషన్​కు నివేదించారు.

కాసేపట్లో పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ - పిఠాపురంలో భారీ ర్యాలీ - Pawan Kalyan Nomination With Rally

పవన్​ వద్ద మొత్తం 11 వాహనాలు ఉన్నాయి. అందులో ఒకటి బైక్​ కాగా మరొకటి పికప్​ ట్రక్,​ మరో 9 కార్లు ఉన్నాయి. పవన్​ 2010 సంవత్సరంలో హార్లే డేవిడ్​ సన్​ బైక్​ కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ బైక్​ ధర 32లక్షల 66వేల 536 రూపాయలు. ఆ తర్వాత 2011లో పవన్​ ఆర్​ క్లాస్​ 360 మోడల్​ బెంజ్​ కారు కొన్నారు. దాని ధర 72లక్షల 95వేల 264 రూపాయలు. ఇక 2014లో మహీంద్రా కంపెనీకి చెందిన ఎస్​ 8 మోడల్​ స్కార్పియోను 13లక్షల 82వేల 240 రూపాయలకు కొనుగోలు చేశారు. 2021లో టాటా యోధా పికప్​ ట్రక్ తీసుకున్నారు. ఆ వాహనం ధర 9లక్షల 19వేల 098 రూపాయలు మాత్రమే. పవన్​ వద్ద ఉన్న వాహనాల్లో అతి తక్కువ ధర దీనిదే కావడం గమనార్హం.

వైసీపీ చిల్లర వ్యవహారాలు ఆపాలి - చిరంజీవి జోలికొస్తే సహించేది లేదు: పవన్​ - pawan kalyan varahi vijayabheri

2021లో ఎస్​ క్లాస్​ 560 మోడల్​ బెంజ్​ కారును 2కోట్ల 42లక్షల 06వేల 101 రూపాయలకు పవన్​ కొనుగోలు చేశారు. 2022లో రేంజ్ రోవర్​ స్పోర్స్ట్​ కారును 5కోట్ల 47లక్షల 03వేల 087 రూపాయలకు కొనుగోలు చేశారు. పవన్​ కొనుగోలు చేసిన వాహనాల్లో ఇదే అత్యధిక విలువైనది కావడం విశేషం.

2022 సంవత్సరంలో పవన్​ కళ్యాణ్​ ఆరు కార్లు కొన్నారు. అందులో మొదటిది 2కోట్ల 53లక్షల 70వేల 879 రూపాయలు వెచ్చించి టయోటా కంపెనీ ల్యాండ్ క్రూసర్, టయోటా కంపెనీకి చెందిన వెల్ఫేర్​ కారును కోటీ 11లక్షల 88వేల 854 రూపాయలు పెట్టి కొన్నారు.

pawan_kalyan_vehicles
pawan_kalyan_vehicles

71లక్షల 54వేల 046రూపాయల విలువైన జీప్​ వ్రాంగ్లర్​ కారును, తర్వాత మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో ఎస్​ 11 మోడల్ కార్లు మరో రెండింటిని పవన్​ కొనుగోలు చేశారు. ఒక్కోదాని విలువ 23లక్షల 49వేల 648రూపాయలుగా పవన్​ నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. మొత్తంగా ఆయన వద్ద ఒక బైక్​, పికప్ ట్రక్ 9 కార్లు ఉండగా వాటి మొత్తం విలువ 14కోట్ల 01లక్షా 85వేల 401 రూపాయలు.

రాజానగరం గంజాయి, ఇసుక దోపిడీకి కేంద్రంగా మారింది: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Varahi Yatra

Last Updated : Apr 23, 2024, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.