ETV Bharat / politics

ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలి: పవన్‌ - Pawan Kalyan on Veera Mahilalu

Janasena Chief Pawan Kalyan on Veera Mahilalu: ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ సమావేశం నిర్వహించారు.

Janasena_Chief_Pawan_Kalyan_on_Veera_Mahilalu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 9:08 AM IST

Janasena Chief Pawan Kalyan on Veera Mahilalu: సార్వత్రిక ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్‌, నాగబాబు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, మహిళా నేతలు, వీర మహిళ కన్వీనర్లు పాల్గొన్నారు.

జనసేనలో మహిళలకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో వీర మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఆవశక్యతను, ఎన్డీయే కూటమి విధానాలను గడపగడపకు తీసుకెళ్లాలన్నారు.

"రాబోయే ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలి. జనసేనలో మహిళలకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఆవశక్యతను, ఎన్జీయే కూటమి విధానాలను గడపగడపకు తీసుకెళ్లాలి." - పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

వైసీపీ భూ బకాసురులతో పోరాడలేక నిండు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది: చంద్రబాబు - Chandrababu on Family Suicide

Janasena MLA Candidates List: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జనసేన పోటీ చేయబోతున్న స్థానాల్లో 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధం అయింది.

ఇందులో ఏడు స్థానాల అభ్యర్థులను ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. తాజాగా 11 స్థానాలకు సంబంధించి ఆయా అభ్యర్థులను పిలిచి వారికి విధివిధానాలు తెలియజేసి ప్రచారం చేసుకోవాలని పచ్చజెండా ఊపారు. జనసేన పోటీ చేయబోయే మరో 3 స్థానాలను పెండింగ్​లో పెట్టింది.

Janasena_MLA_Candidates_List
Janasena_MLA_Candidates_List

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి. గన్నవరం శాసనసభ నియోజకవర్గం జనసేనకు దక్కింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఆయనను పవన్‌ కల్యాణ్‌ పిలిపించి మాట్లాడారు. ప్రచారం చేసుకోవాలని సూచించారు.

విశాఖ తీరంలో భారీ డ్రగ్స్ పట్టివేతపై చంద్రబాబు, పవన్ స్పందన- జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ - Chandrababu reacted on Drugs Case

చిత్తూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరి తిరుపతి శాసనసభ స్థానం అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. దీనిపై తిరుపతి నియోజకవర్గ పార్టీ శ్రేణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్థానిక నాయకులను మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. అందరూ కలిసి పని చేయాలని ఉద్బోధించారు.

స్థానికేతర అభ్యర్థి కావడంతో టీడీపీ, బీజేపీ నుంచి కూడా సహకారం లభించడం లేదని పార్టీ నాయకులు నాగబాబుకు తెలియజేశారు. దీంతో మరోసారి సర్వే చేసి అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అక్కడి నుంచి హరిప్రసాద్‌, కిరణ్‌ రాయల్‌, టీడీపీలో ఉన్న మరో ఇద్దరు నాయకులు జనసేన నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు.

సీటు ఇస్తే జనసేనలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనలో ఉన్న ఒక యువ నాయకుడు, ఆ ఇద్దరు టీడీపీ నాయకులు ఒక అంగీకారానికి వచ్చి తమ ముగ్గురిలో ఎవరికి ఇచ్చినా సహకరించుకునేందుకు సిద్ధమనే సంకేతాలు పార్టీకి పంపుతున్నారు. మరోవైపు మచిలీపట్నం ఎంపీ స్థానానికి బాలశౌరిని దాదాపు ఖరారు చేశారు. అయితే ఆయనను అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.