ETV Bharat / politics

ప్రైవేటు భూముల్లోనూ మట్టి తన్నుకుపోతున్న వైసీపీ గద్దలు- ప్రశ్నిస్తే బెదిరింపులు - Gravel mining - GRAVEL MINING

YSRCP Leaders Illegal Mining : 'దాపెట్టేస్తున్నాను. మొత్తం దోచుకుపోతున్నారు కొడుకులు. తిండి లేకపోయినా పర్లేదు. మట్టిని అడిగితే పెడుతుంది. మట్టే లేకుంటే?!' ఓ సినిమాలో ఎల్​బీ శ్రీరాం చెప్పిన ఈ డైలాగ్​ మట్టి మాఫియా చెలరేగిపోతుంటే భవిష్యత్​లో ఎదురయ్యే దుష్పరిణామాలను కళ్లకు కడుతుంది. సరిగ్గా ఇలాగే ఉంది గుంటూరు జిల్లాలో అధికార వైఎస్సార్సీపీ నేతల మట్టి దందా.

ysrcp_leaders_illegal_mining
ysrcp_leaders_illegal_mining
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 2:04 PM IST

Updated : Mar 23, 2024, 7:17 PM IST

YSRCP Leaders Illegal mining : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, కలెక్టర్, భూగర్భగనులు, రెవెన్యూ, నిఘా అధికారులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీకి చెందిన కొంతమంది గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇన్నాళ్లు కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూముల్ని దోచుకున్న అక్రమార్కులు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల భూముల మీద కన్నేశారు. అసైన్డ్ భూముల్లో చేపల చెరువు పేరిట మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తమ భూముల్లో మట్టి దందా ఏంటని ప్రశ్నిస్తే తిరిగి వారిపైనే కేసులు పెడతామని హెచ్చరించే స్థాయికి అక్రమార్కుల ఆగడాలు చేరాయి.

ప్రైవేటు భూముల్లోనూ మట్టి తన్నుకుపోతున్న వైసీపీ గద్దలు- ప్రశ్నిస్తే బెదిరింపులు

Soil mafia in Mangalagiri: "పర్మిషన్ ఏం లేదండీ..! తవ్వుకోమని ఎమ్మెల్యే చెప్పారండీ"

ఇన్నాళ్లూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సహజ వనరులు దోపిడీ చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కోడ్‌ వచ్చినా లెక్కచేయకుండా అరాచకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గుంటూరు జిల్లాలో అధికారం అండగా ఉందని ధీమాతో మట్టిమాఫియా చెలరేగిపోతోంది. మేడికొండూరు మండలం పేరేచర్ల కొండల్లో పట్టా, అసైన్డుభూముల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొండలచెరువులోని భూముల్లో నాణ్యమైన ఎర్రమట్టిని రాత్రివేళ తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటోంది. అక్రమార్కులకు అధికార పార్టీ నేతలు అండగా ఉండటంతో యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఇక్కడే నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన పట్టాభూములు ఉండగా అందులోనూ తవ్వకాలు చేస్తున్నారు. దీనిని గుర్తించిన విద్యాసంస్థల కమిటీ జిల్లా కలెక్టర్‌ నుంచి భూగర్భగనులు, రెవెన్యూ, నిఘా విభాగాలకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ రాత్రివేళ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

YSRCP Leaders Illegal Mining అర్ధరాత్రి గ్రామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న స్థానికులు

భారీ ప్రొక్లెయినర్లు, టిప్పర్లు పెట్టి మట్టిని తరలిస్తున్నారు. గుంటూరు నగరం, పరిసర మండలాల్లో మట్టి మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి పేరుతో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. సదరు వ్యక్తి మట్టి మాఫియాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటంతో ఎవరూ అడ్డుకోలేని పరిస్థితి ఉంది. ఇదే అదనుగా రాత్రివేళల్లో వందల టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు.

Illegal Soil Transport: అనుమతులు ఒకలా.. తరలింపు మరోలా.. వైఎస్సార్సీపీ నాయకుల మట్టి రవాణా దందా

ఇన్నాళ్లూ ప్రభుత్వ, పొరంబోకు భూములకు పరిమితమైన అక్రమ తవ్వకాలు ఇప్పుడు ఏకంగా పట్టాభూముల్లోనూ చేస్తున్నారు. పట్టాదారులు వెళ్లి తమ భూముల్లో ఎలా తవ్వకాలు చేస్తారని ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెడతామని బెదిరించడంతో వారు మిన్నకుండిపోయారు. మట్టిమాఫియా ఒక బృందంగా ఏర్పడి అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నా అధికార యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. దీనివెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో పట్టాదారులు సైతం నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు.

YCP leaders illegal soil mining: జగనన్న కాలనీల పేరుతో అక్రమ మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Last Updated : Mar 23, 2024, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.