ETV Bharat / politics

రెండు జాతీయ పార్టీలు బీఆర్​ఎస్​ను టార్గెట్ చేశాయి​ : హరీశ్​ రావు - Harish Rao on CM Revanth Reddy

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 8:09 PM IST

Harish Rao Comments on CM Revanth : రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బీఆర్​ఎస్​ను టార్గెట్​ చేశాయని బీఆర్​ఎస్​ నేత హరీశ్​ రావు అన్నారు. అలాంటప్పుడు బీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటయ్యాయని రేవంత్​ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. ఎక్స్​ వేదికగా హరీశ్​రావు కాంగ్రెస్​ పార్టీ, సీఎం రేవంత్​ రెడ్డిపై విమర్శలు చేశారు.

Harish Rao Comments on CM Revanth
Harish Rao Comments on CM Revanth (ETV Bharat)

BRS Leader Harish Rao Fires on CM Revanth Reddy : పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించడం విడ్డూరమని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. మెదక్​లో బీజేపీను బీఆర్​ఎస్​ గెలిపించిందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్​ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మూడు చోట్ల బీఆర్​ఎస్​ మెజారిటీ సాధించిందని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్​ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్​ఎస్​ మెజారిటీ సాధించిందని తెలిపారు. సోషల్​ మీడియా వేదిక ఎక్స్​ ద్వారా కాంగ్రెస్​, రేవంత్​ రెడ్డిపై విమర్శలు చేశారు.

సీఎం రేవంత్​ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చిందని, ఆయన అక్కడ బీజేపీకి కాంగ్రెస్​ ఓట్లు మళ్లించారా అని హరీశ్​రావు ప్రశ్నించారు. రేవంత్​ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్​నగర్​లో బీజేపీ ఎలా గెలిచిందని అన్నారు. అక్కడి ఏడుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు బీజేపీను గెలిపించారా అని అడిగారు. కొడంగల్​లో రేవంత్​ రెడ్డికి వచ్చిన 32 వేల మెజారిటీ పార్లమెంటు ఎన్నికల్లో 21 వేలకు తగ్గిందని చెప్పారు. ఇలా అయితే మిగతా ఓట్లను రేవంత్​ రెడ్డి బీజేపీకి వేయించారా అని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు.

రేవంత్​ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో బీజేపీ భారీ మెజారిటీతో ఎలా గెలిచిందని హరీశ్​రావు కాంగ్రెస్​ను అడిగారు. ఈ రెండు చోట్ల బీజేపీని కాంగ్రెస్​ గెలిపించిందా అని ప్రశ్నించారు. బీజేపీ పంచన చేరింది, మోదీ శరణు చొచ్చింది రేవంత్​ రెడ్డి అని ఆరోపించారు. కాంగ్రెస్​లో ఉండి బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నిండు సభలో మోదీని పెద్దన్న అని సంబోధించారని అన్నారు. మోదీ, రేవంత్​ రెడ్డి కుమ్మక్కై సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. విభజన హామీలపై మోదీ ప్రభుత్వాన్ని రేవంత్​ రెడ్డి గట్టిగా నిలదీయడం లేదని ఆక్షేపించారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బీఆర్​ఎస్​ను టార్గెట్​ చేశాయన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటయ్యాయని రేవంత్​ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని హరీశ్​రావు మండిపడ్డారు.

"పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో ఆరోపించడం విడ్డూరం. మెదక్​లో బీజేపీని బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. రేవంతే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా? రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బీఆర్ఎస్​ను టార్గెట్ చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు." - హరీశ్​రావు ట్వీట్

కాంగ్రెస్ పార్టీ -​ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంది : హరీశ్ రావు - brs mla Harish on Ed raids

రఘునందన్​ రావుకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు - Harish Rao Greetings Raghunandanrao

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.