ETV Bharat / politics

ఫ్రీహోల్డ్‌ పేరుతో 1.26 లక్షల ఎకరాల్లో వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు - Y YSRCP LEADERS LAND SCAM

నిబంధనలకు విరుద్ధంగా 22ఏ జాబితా నుంచి భూముల తొలగింపు-దొంగ పట్టాలతో వేల ఎకరాలు కాజేసిన వైనం-కూటమి సర్కారు విచారణతో వెలుగులోకి.

freehold_land_scam_by_ysrcp_leaders_in_sri_sathya_sai_district
freehold_land_scam_by_ysrcp_leaders_in_sri_sathya_sai_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Freehold Land Scam By YSRCP Leaders in Sri Sathya Sai District : వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన ఫ్రీహోల్డ్‌ చట్టాన్ని ఆసరాగా తీసుకుని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు. ఎసైన్‌ చేయని ప్రభుత్వ భూముల్ని చేసినట్లుగా చూపించి సొంతం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ భూములపై చేపట్టిన విచారణలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

శ్రీసత్యసాయి జిల్లాలో ఏకంగా 1.26 లక్షల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగించారు. ఫ్రీహోల్డ్‌ చేసిన మొత్తం భూమిలో సగానికిపైగా అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. దొంగ పట్టాలు సృష్టించి రికార్డులు తారుమారు చేసి విలువైన ప్రభుత్వ భూముల్ని వైఎస్సార్సీపీ నాయకులు కాజేశారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది.

నకిలీ డి-పట్టాలు సృష్టించి : 2003కు ముందు ఎసైన్‌ చేసిన భూములన్నింటికీ యాజమాన్య హక్కులు కల్పించాలని గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని ఆసరాగా తీసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నంబర్లను గతంలోనే ఎసైన్‌ చేసినట్లుగా నకిలీ డి-పట్టాలు సృష్టించారు. విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి 2003కు ముందు తేదీలతో సంతకాలు చేయించుకున్నారు.

తర్వాత వాటిని ఆధారాలుగా చూపి ఫ్రీహోల్డ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని వాటికి యాజమాన్య హక్కులు కల్పించారు. ఇలా శ్రీసత్యసాయి జిల్లాలో ఏకంగా 89,331 ఎకరాల ప్రభుత్వ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడం గమనార్హం. ముదిగుబ్బ, పుట్టపర్తి మండలాల్లో గతంలోనే రికార్డులు కాలిపోవడాన్ని అవకాశంగా తీసుకుని పెద్ద మొత్తంలో నకిలీ పట్టాలు సృష్టించినట్లు తెలుస్తోంది.

వెలుగులోకి వైఎస్సార్సీపీ భూ అక్రమాలు - రికార్డుల పరిశీలనలో బయటపడుతున్న వాస్తవాలు

ఫ్రీహోల్డ్‌కు ముందే కొనుగోలు : ఎసైన్‌మెంట్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే చట్టం వస్తుందని ముందే తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. అర్హత కలిగిన రైతులను ముందుగానే గుర్తించి వారికి డబ్బు ఆశ చూపించారు. అమ్మడానికి ఒప్పుకోని రైతులను రెవెన్యూ అధికారుల ద్వారా ఇబ్బందులకు గురి చేశారు. వారి ఒత్తిళ్లు తట్టుకోలేక చాలా మంది ఎసైన్డ్‌ రైతులు భూముల్ని తక్కువ ధరకు అమ్మేసుకున్నారు. ఇలా జిల్లాలో 7,098 ఎకరాలను ఫ్రీహోల్డ్‌కు ముందే కొనుగోలు చేశారు.

తర్వాత ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో వాటి విలువ మూడు, నాలుగు రెట్లు పెరిగిపోయింది. ధర్మవరం, పుట్టపర్తి మండలాల పరిధిలో ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న వేల ఎకరాల అసైన్డ్‌ భూముల్ని వైఎస్సార్సీపీ నాయకులు కాజేశారు.

అక్రమంగా రిజిస్ట్రేషన్లు : శ్రీసత్యసాయి జిల్లాలో 4,13,769 ఎకరాల ఎసైన్డ్‌ భూమి ఉంది. ఫ్రీహోల్డ్‌ చట్టాన్ని ఉపయోగించి 2023లో 2,34,391 ఎకరాలను 22ఏ నుంచి తొలగించారు. వీటిలో 1.26 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఫ్రీహోల్డ్‌ చేసిన భూముల్లో 5,242 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిల్లోనూ 2,141 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. దాంతోపాటు కొందరు సబ్‌రిజిస్ట్రార్లు లంచాలు తీసుకుని ఫ్రీహోల్డ్‌ చేయని 520 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు చేశారు. వీటిపైనా ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

40 వేల ఎకరాలు - కారు చౌకగా కొట్టేసిన వైఎస్సార్సీపీ నేతలు - assigned land scam in Jagan Ruling

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.