Harish Rao on CM Revanth over Development : కాంగ్రెస్ సర్కారు ప్రతిపక్షాలపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రూ.10 వేల కోట్ల విలువ చేసే 34,511 స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. అభివృద్ధి కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమన్న ఆయన, ప్రభుత్వ చర్యతో రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్, మున్సిపల్ సహా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గం. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయం. రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2024
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద 33 జిల్లాల్లో… pic.twitter.com/vGXKbpEkAL
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక అజెండాతో ముందుకు సాగుతోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొత్త పనులను చేపట్టే శక్తిసామర్థ్యాలు లేవని తేలిపోయిందన్న ఆయన, మంజూరైన పనులను పూర్తి చేసే కనీస నైతిక బాధ్యత కూడా లేదని స్పష్టమైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేసిన మాజీమంత్రి, కేసీఆర్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గాలకు కేటాయించిన ఎస్డీఎఫ్ నిధులను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కురచబుద్ధికి నిదర్శనం : గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన అనాలోచిత చర్యలతో తన ఆనవాలునే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు కేటాయించి, గెలవని చోట నిధులు నిలిపివేస్తున్నారని ఇది కాంగ్రెస్ కురచబుద్ధికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ పూరిత రాజకీయాలు చేయడం పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని కోరారు.
ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు : ఉపాధ్యాయుల బదిలీలతో అనేక పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సారొస్తారా అంటూ ఎదురు చూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతోందన్న ఆయన, ఉపాధ్యాయులు లేక, విద్యా వాలంటీర్లను నియమించక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయన్నారు. ఫలితంగా తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు, బడికి దూరమవుతున్నరని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖను కూడా తనే నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవంటూ విమర్శించారు.
సారొస్తారా..! అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశే మిగులుతున్నది.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2024
ఉపాధ్యాయులు లేక, విద్యా వాలంటీర్లను నియమించక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి.
తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు, బడికి దూరమవుతున్నరు.
విద్యాశాఖను కూడా తానే నిర్వర్తిస్తున్న… pic.twitter.com/GI019ESOmg