Jagan Visited Family of Murdered Subbarayadu: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలను ప్రోత్సహించే వారిని సైతం కేసుల్లో చేర్చాలని. నారా లోకేశ్, సీఎం చంద్రబాబు నాయుడులను బాధ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 3వ తేదీన నంద్యాల జిల్లా మహనంది మండలం సీతారామపురంలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చున్నాడని సుబ్బరాయుడును చంపడం అన్యాయం అని జగన్ అన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణాలు తెలపాలన్నారు. అందరం ఒకటై ప్రతిఘటించాలని జగన్ సూచించారు. సీతారామపురం ఘటనపై హైకోర్టుకు వెళుతామని జగన్ చెప్పారు.
జగన్పై నిమ్మల కౌంటర్: జగన్ నంద్యాల జిల్లా పర్యటనపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ వేశారు. రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా జగన్ మాటలున్నాయని నిమ్మల విమర్శించారు. చేసిన తప్పులు పగలు, రాత్రి జగన్కు గుర్తొస్తుండటంతో ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా రెడ్ బుక్కే గుర్తుకొస్తోందనుకుంటా అని మండిపడ్డారు. కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని అన్నారు. ప్రజాతీర్పు ఓర్వలేను అన్నట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని నిమ్మల దుయ్యబట్టారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హత్యలకు కూడా జగన్ సమాధానం చెప్పలని మంత్రి నిమ్మల డిమాండ్ చేశారు.
మరోసారి రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం - YSRCP MLC Duvvada Srinivas Issue
నంద్యాల ఘటనలో ఎస్సీల భూమిని వైఎస్సార్సీపీ నేత కబ్జా చేశాడని, గ్రామ పెద్ద వైఎస్సార్సీపీ నేత నారప్ప రెడ్డికి భూమి తిరిగి ఇవ్వమని చెప్పటంతో అతనిపై దాడి చేయించాడని ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను వ్యక్తిగత స్వార్ధం కోసం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. వినుకొండ ఘటనలో అసత్యాలు ప్రచారం చేయటంలో విఫలమై భంగపడిన రీతిలోనే ఇవాళ నంద్యాల్లోనూ జగన్ బోల్తా పడ్డాడన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని జగన్ గుర్తించాలని నిమ్మల రామానాయుడు హితవుపలికారు.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ- మరోసారి పార్టీ శ్రేణులతో జగన్ మంతనాలు - visakha Mlc Election