ETV Bharat / politics

అబద్ధాలు ఆడటంలో ఏదైనా అవార్డు ఉంటే - సీఎం రేవంత్​ రెడ్డికే ఫస్ట్​ ప్రైజ్ : హరీశ్‌రావు - harish rao counter to cm revanth - HARISH RAO COUNTER TO CM REVANTH

Harish rao fires on CM Revanth : బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లాను ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలులో రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని, రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు, తెలంగాణ సమాజానికి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Harishrao reacts on CM Revanth Comments
Harish rao fires on CM Revanth
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 10:12 PM IST

Harishrao reacts on CM Revanth Comments : అబద్ధాలు ఆడటంలో ఏదైనా అవార్డు ఉంటే అది ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి వస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పడం, పచ్చి అబద్ధాలు ఆడటం సీఎం రేవంత్ రెడ్డి నైజమని ఆయన ధ్వజమెత్తారు. మెదక్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లాను ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీశ్‌రావు - తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచన - Harish Rao Visit Crop Damage

Lok Sabha Elections 2024 : ఉమ్మడి మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా చేసి, అభివృద్ధి పథంలో నడిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమని హరీశ్‌రావు పేర్కొన్నారు. మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీ, మెదక్ రైల్వే లైన్ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూ.వంద కోట్లతో ఘనపూర్ ఆనకట్ట అభివృద్ధి, కాల్వల లైనింగ్ పనులు పూర్తి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మెదక్ లోక్‌సభ పరిధిలో మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇన్ని పనులు జరిగితే కేసీఆర్ ఏమీ చేయలేదని అనడం దారుణమన్నారు.

రేవంత్ ప్రభుత్వమే మెదక్ జిల్లాను మోసం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు. ఏడుపాయల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేస్తే, ఆ నిధులను రద్దు చేశారని, అందుకు అమ్మవారి ఉసురు తగులుతుందన్నారు. ఇక్రిశాట్, బీహెచ్ఈఎల్ ఎప్పుడో ఏర్పాటు కాగా, వాటిని ఇందిరా గాంధీ ఇచ్చిందని రేవంత్ అబద్దాలు చెప్పారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే, బెదిరించే మాటలు మాట్లాడుతున్నట్లు తెలిపారు.

చేతనైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు, తెలంగాణ సమాజానికి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 20 రోజులైనా వడ్లు కొనే దిక్కులేదని హరీశ్‌రావు అన్నారు.

లోక్‌సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డిపై రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని దుయ్యబట్టారు. ఆయన పటాన్‌చెరు నియోజవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని, ఓటు హక్కు కూడా ఉందని తెలిపారు. మెదక్ లోక్‌సభ స్థానంలో ఇరవై ఏండ్ల నుంచి బీఆర్ఎస్ గెలుస్తోందని, ఈ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు.

"మెదక్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. ఇవాళ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. సీఎం కానీ, మంత్రులు కానీ ధాన్యం కేంద్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవడం లేదు". - హరీశ్‌రావు, మాజీ మంత్రి

మెదక్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడేవి పచ్చి అబద్దాలే : హరీశ్‌రావు

హామీలపై నిలదీస్తే రేవంత్‌కు అంత అసహనమెందుకు? : హరీశ్‌రావు - Harish Rao Comments on CM Revanth

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు - నూరు అబద్ధాలతో సమానమని నిరూపితమైంది : హరీశ్ రావు - Harish Rao Tweets On Congress

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.