Etela Rajendar MLC Election Campaign in Khammam : రాష్ట్రంలో ఉపఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇవాళ చివరి రోజు అవ్వడంతో ప్రధాన పార్టీ నాయకులు బిజీ బిజీ గడుపుతున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు. అనంతరం తమ పార్టీ చేసిన అభివృద్ధిని, ఇతర పార్టీలు చేసిన లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తూ తమ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
Etela Rajendar Shocking Comments : ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. గతం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మండలాలు వారిగా డబ్బులు పంచినా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షనే గెలిచిందని అన్నారు. 2008లో 17 మంది పోటీ చేస్తే ఏడుగురు గెలిచామని మళ్లీ 2010లో ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగి భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమానికి సానుకూలం కాదన్న వాదనకు భిన్నంగా ఇక్కడ కూడా ఉద్యమ ఆకాంక్ష చెలరేగిందని తెలిపారు. పట్టభద్రులు విజ్ఞానవంతులని వారిని డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలనుకోవడం పొరపాటని హితవు పలికారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మారలేదు : ఈటల రాజేందర్ - Etela Rajender Comments on Congress
MLC BY Election 2024 in Telangana : పదేళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించలేకపోయింది ఈటల రాజేందర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే చేయని పార్టీ ఇప్పుడెలా చేస్తుందని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ సర్కార్ పక్కదారి పట్టించిందని విమర్శించారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆరోపించారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతోందని తెలిపారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపానని పేర్కొన్నారు. పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈటల పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
"గత ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణం నాలుగు లక్షల కోట్లు, 2జీ స్కాం రూ.రెండు కోట్లు కుంభకోణం జరిగింది. కాని మోదీ ప్రభుత్వంలో ఎలాంటి స్కాంలు లేకుండా సగటు భారతీయుడు గర్వంగా జీవిస్తున్నాడు. పట్టభద్రులు అందరూ ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి. మేమంతా మీ వెంట నిలుస్తామని హామీ ఇస్తున్నాను."- ఈటల రాజేందర్, బీజేపీ నేత