ETV Bharat / politics

వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు ఇవ్వండి - ఈసీని కోరిన బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ - EC NOTICES TO KCR - EC NOTICES TO KCR

EC NOTICES TO BRS CHIEF KCR : సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల జారీ చేసిన నోటీసులపై బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ తాజాగా స్పందించారు. వారం రోజుల గడువు ఇవ్వాలని ఈసీని కోరారు.

EC Notices to KCR over Comments Made in Sirscilla
EC Notices to KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 2:55 PM IST

Updated : Apr 18, 2024, 3:57 PM IST

EC Notices to KCR over Comments Made in Sirscilla : బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​కు ఈసీ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్​ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం మాజీ ముఖ్యమంత్రిని ఈ నెల 18 ఉదయం 11 గంటల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని 2019, 2023లోనూ కేసీఆర్​కు ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం గుర్తు చేసింది.

పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికల నియమావళిని పాటించాలని ఈసీ కోరింది. నిరాధార ఆరోపణలు, దుర్భాషలు ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని, ఎన్నికల వాతావరణం దెబ్బ తింటుందని ఈసీ తెలిపింది. ఈ మేరకు కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాజన్న సిరిసిల్ల కలెక్టర్ నుంచి ఈసీ నివేదిక తెప్పించుకున్న తర్వాత ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా స్పందించిన కేసీఆర్​, తనకు సమయం కావాలని కోరారు. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు కోరారు. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలి : కేసీఆర్‌ - KCR Polam Bata Programme

అసలు కేసీఆర్​ ఏమన్నారంటే..? పొలం బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్​లో పర్యటించిన కేసీఆర్​, పంటల పరిశీలన అనంతరం సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ సర్కార్​పై తీవ్ర విమర్శలు చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, నీటి నిర్వహణ సామర్థ్యం లేదని, తెలియదని ఎద్దేవా చేశారు. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో సజీవ జలధారలు సృష్టించామన్న కేసీఆర్, గత 8 ఏళ్లు ప్రజలు ఆ ఫలాలను అనుభవించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు తలెత్తాయని, 2014కు ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో మళ్లీ ఆ పరిస్థితి చూస్తున్నామని విమర్శించారు. రేవంత్ సర్కార్​ అసమర్థత, తెలివి తక్కువతనం వల్ల ఈ పరిస్ధితి వచ్చిందని ధ్వజమెత్తారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే నేడు పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కుటుంబాలను ఆదుకోకపోతే ప్రభుత్వానికి ఉసురు తగులుతుందన్నారు.

ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ సామర్థ్యం లేదు, తెలియదు : కేసీఆర్‌ - LOK SABHA Election 2024

కాంగ్రెస్​కు కనీస పరిజ్ఞానం లేదు : మరోవైపు కాళేశ్వరం డిజైన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస పరిజ్ఞానం లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.​ మేడిగడ్డ వద్ద 300 పిల్లర్లతో బ్యారేజీ నిర్మించామని, వాటిల్లో 3 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కుంగిపోయినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నేత నిరంజన్​ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయగా, పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్​కు నోటీసులు జారీ చేసింది.

కాళేశ్వరం డిజైన్లపై కాంగ్రెస్‌ పాలకులకు కనీస పరిజ్ఞానం లేదు - అందుకే అలా? : కేసీఆర్‌ - KCR Polam Bata Programme

Last Updated : Apr 18, 2024, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.