Election Code Violation in AP : ప్రభుత్వాలు దశాబ్దాలుగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి. కానీ ఏ ముఖ్యమంత్రికీ రాని వింత ఆలోచన ఏపీ జగన్‌కే వచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వీటిపైనా జగన్ తన బొమ్మను అచ్చేయించుకున్నారు. అదేదో ప్రభుత్వ అధికార గుర్తైనట్టు నవరత్నాల లోగో ముద్రించారు. 1బీ, అడంగల్, భూయాజమాన్య హక్కు పత్రం, ఫ్యామిలీ మెంబర్ ధ్రువీకరణ పత్రం ఇలా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువపత్రాలపై తన బొమ్మ ముద్రించుకున్నారు.
YSRCP Violating The Rules Of Election Code : రాష్ట్రం సొంత సామ్రాజ్యమైనట్టు, ప్రతి ప్రభుత్వ కార్యంలోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి బొమ్మను ముద్రించుకున్నారు. నవరత్నాల లోగోను వేయించారు. జగన్ పైత్యానికి ఎన్నికల సంఘం సరైన మందు వేసింది. ఎన్నికల కోడ్ (Election Code) అమలు దృష్ట్యా జగన్ ముద్రతో ఉన్న ఏ ధ్రువపత్రాలూ జారీ చేయొద్దని ఆదేశాలిచ్చింది.
జగన్ దీనికి బాధ్యత వహిస్తారా? : వైఎస్సార్సీపీ ప్రభుత్వం 'జగనన్న సురక్ష (Jagananna Suraksha)' పేరుతో ఉచితంగా ఇచ్చేందుకు అంటూ భారీగా ధ్రువపత్రాలు ముద్రించింది. ఒక్కో పత్రం ముద్రణకు రూ.50లకు పైనే ఖర్చు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్కోచోట ఇలాంటి పత్రాలు వందల కొద్దీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టాలని క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే ఇవి చెల్లవని తెలిసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్ దీనికి బాధ్యత వహిస్తారా? తన జేబులో నుంచి డబ్బు చెల్లిస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నయి.
విశాఖ ఉక్కు ఊపిరి తీశారు - మెడలు వంచుతామని కేంద్రం ముందు సాగిలపడ్డ జగన్
మీసేవ నిర్వాహకుల ఆవేదన : జగన్ రెడ్డి ప్రచార పిచ్చి మీసేవా నిర్వాహకుల కొంప ముంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల వరకూ మీసేవ కేంద్రాలున్నాయి. వీటి నిర్వాహకులు రూ.3ల చొప్పున ప్రభుత్వానికి చెల్లించి జగన్ బొమ్మ ఉన్న ఒక్కో పత్రాన్నితీసుకున్నారు. ఒక్కో మీసేవా కేంద్రంలో ఇలాంటివి వెయ్యి నుంచి 2 వేల వరకు ధ్రువపత్రాలు నిల్వ ఉన్నాయి. ఈసీ ఆదేశాలతో అవన్నీ నిరుపయోగమైనట్లేనని మీ సేవా నిర్వాహకులు వాపోతున్నారు. కనీసం రూ.3 వేల నుంచి రూ.6వేల వరకు నష్టమని లబోదిబోమంటున్నారు. రెండు రోజులుగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 1బీ, అడంగల్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాలను చాలా మంది ఆశ్రయిస్తున్నారు. పత్రాలు అందుబాటులో లేక వారిని వెనక్కి పంపించేస్తున్నారు. అధికారులు మాత్రం జగన్ బొమ్మ, నవరత్నాల లోగో లేని పత్రాలను జిల్లాలకు పంపించినట్టు చెబుతున్నారు.
హంతకుల పార్టీకి ఓటేయొద్దు - జగనన్న పార్టీ గెలవొద్దు : వైఎస్ సునీత
జగన్ మాటల్లోనే 'నా' చేతల్లో 'నో'- సొంత సామాజికవర్గానికే మరోసారి పెద్దపీట