ETV Bharat / politics

ద్వారంపూడి అడ్డాలో రేషన్​ మాఫియా - సూత్రధారులు, పాత్రధారులపై ఫోకస్​ - RATION MAFIA IN KAKINADA

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 7:19 AM IST

Updated : Jul 13, 2024, 7:38 AM IST

Ration Mafia : కాకినాడ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన 215 కోట్లు విలువైన 51,427 మెట్రిక్​ టన్నుల బియ్యం విషయంలో సాక్ష్యాలు బయటపడుతున్నాయి. ఇందులో 24,936 టన్నులు పీడీఎస్​ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బియ్యం వ్యవహారంలో ద్వారంపూడిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ration mafia
ration mafia (ETV Bharat)

Dwarampudi Chandra Sekhar Reddy Family Behind Ration Mafia : రేషన్‌ బియ్యం వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 51,427 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పేదల బియ్యం 24,936 టన్నులున్నట్లు తేలింది. కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మాఫియాకు సూత్రధారులు, పాత్రధారులెవరనేది తేల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

విదేశాలకు ఎగుమతి : కాకినాడ రేషన్‌ మాఫియాకు అడ్డాగా ఎలా మారిందో సాక్ష్యాధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 15 రోజులుగా కాకినాడ జిల్లాలో నిర్వహిస్తున్న తనిఖీల్లో 51,427 టన్నుల బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకోగా ఇందులో 24,936 టన్నులు పీడీఎస్‌ బియ్యం (PDS Rice) అని అధికారికంగా తేలింది. కాకినాడ తీరంలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో హెచ్‌ గోదాములో 3286 టన్నులు, అశోక ఇంటర్నేషనల్‌లో 3161, ఎస్​ఆర్​ జ్యోతిలో 1878, అయ్యప్ప ఎక్స్‌పోర్ట్స్‌లో 1699, లవన్‌ ఇంటర్నేషనల్‌లో 776, కాన్కర్‌ గోదాములో 411, సాయితేజ షిప్పింగ్‌ సర్వీసులో 330, శ్రీనివాస ట్రేడింగ్‌ అండ్‌ కోలో 269, విశ్వప్రియ ఎక్స్‌పోర్ట్స్‌లో 184, సరళ ఫుడ్స్‌లో 115, సార్టెక్స్‌లో 73 టన్నుల పీడీఎస్​ బియ్యాన్ని (PDS Rice) అధికారులు గుర్తించారు. గోదాములు సీజ్‌ చేసి 6ఎ కేసులు నమోదు చేశారు. పేదల బియ్యం కాకినాడ యాంకరేజి పోర్టు(Kakinada Anchorage Port) ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. దీంతో అక్రమ రవాణా, ఎగుమతులు అడ్డుకోవడానికి పోర్టుకు వెళ్లే మార్గాల్లో నిఘా పెంచాలని నిర్ణయించింది.

కాకినాడ కేంద్రంగా ఆఫ్రికన్ దేశాలకు రేషన్ బియ్యం- సీఐడీతో దర్యాప్తు చేయిస్తామన్న మంత్రి మనోహర్ - Ration rice mafia

సూత్రధారులెవరు? : పేదల బియ్యం వ్యవహారంలో కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. ద్వారంపూడి కుటుంబీకులే పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్, రాష్ట్ర మిల్లర్ల సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం, షిప్పింగ్‌ సంస్థల సంఘంలో కీలక పదవుల్లో కొనసాగారు. అక్రమ నిల్వలు పట్టుబడిన గోదాముల్లో లావాదేవీలు వేర్వేరు యాజమాన్యాల పేర్లతో సాగుతున్నా ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం ఈ కుటుంబం కనుసన్నల్లోనే సాగడంతో సూత్రధారులెవరు? పాత్రధారులు ఎవరన్నదానిపై శోధన సాగుతోంది.

కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించింది: మంత్రి నాదెండ్ల - Nadendla Manohar on Ration Rice

గత ఐదేళ్లలో దస్త్రాల పరిశీలన, తనిఖీల ఊసు లేకపోవడంతో పేదల బియ్యం భారీగా పక్కదారి పట్టింది. గత నెల 27, 28న (జూన్‌ 27, 28) కాకినాడలోని గోదాముల్లో మంత్రి నాదెండ్ల మనోహర్‌ తనిఖీ చేశారు. పోర్టు గోదాముల్లోనే పేదల బియ్యం దొరికాయి. పేదల పొట్టకొట్టి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేసిందని ఈ కేసును సీఐడీకి అప్పగిస్తామని ప్రకటించారు. ద్వారంపూడి అక్రమాలకు అధికార యంత్రాంగం సహకరించిందని ఇకపై అలా సాగనివ్వబోమని వ్యవస్థలో మార్పు తెచ్చేవరకు దాడులు కొనసాగిస్తామన్నారు. వరుస పరిణామాలపై ద్వారంపూడి శిబిరం కిమ్మనడంలేదు.

పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం! - రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ నిలిపివేత - విచారణకు నాదెండ్ల ఆదేశం - Manohar inspected Ration warehouses

Last Updated : Jul 13, 2024, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.