ETV Bharat / politics

రాష్ట్రానికి డ్రోన్​ టెక్నాలజీ- మంత్రితో పలు సంస్థల ప్రతినిధుల భేటీ - Drone Companies met BC Janardhan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 3:37 PM IST

Drone Companies Representatives met with Minister Janardhan Reddy: రాష్ట్రంలో డ్రోన్ సాంకేతితను వినియోగించేందుకు అవకాశం ఉందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. డ్రోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు మంత్రితో సమావేశమై.. డ్రోన్ వినియోగం వల్ల జరిగే ఫలితాలను గురించి వివరించారు.

drone_companies_met_bc_janardhan
drone_companies_met_bc_janardhan (ETV Bharat)

Drone Companies Representatives met with Minister Janardhan Reddy: డ్రోన్ సాంకేతికతను వివిధ శాఖల్లో వినియోగించేందుకు అవకాశాలు ఉన్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయం, రహదారులు, భవనాలు, ఇరిగేషన్, అర్బన్ ఏరియా డెవలప్​మెంట్, డిఫెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, మైనింగ్, సర్వేలు, మ్యాపింగ్, సీడ్ బాల్స్ ప్లాంటేషన్ లాంటి వివిధ రకాల పనులను సులభతరం చేసుకుని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

ఈ మేరకు మంత్రితో డ్రోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇప్పటి వరకు ఏయే రంగాల్లో తమ టెక్నాలజీని వినియోగించి మంచి ఫలితాలు సాధించారో మంత్రికి తెలిపారు. రానున్న కాలంలో డ్రోన్ హబ్​ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయన్న అంశాన్ని మంత్రికి వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల పాపం పండింది: మంత్రుల ధ్వజం - AP MINISTERS ON JOGI RAJEEV ARREST

విద్యారంగంలో మెరుగైన ప్రమాణాలకు సహాయ, సహకారాలు అందిస్తాం- మంత్రి లోకేశ్​తో సింగపూర్ ప్రొఫెసర్ భేటీ - SINGAPORE PROFESSOR MET NARA LOKESH

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.