ETV Bharat / politics

పాలమూరు ప్రజల ఆశీస్సులతో ఎదిగిన కేసీఆర్​, రేవంత్ రెడ్డి - తోడుదొంగలై జిల్లాను భ్రష్టుపట్టించారు : డీకే అరుణ - DK Aruna Fire on Revanth Reddy

DK Aruna on Congress and BRS : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​, ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డికి పాలమూరు ప్రజలు రాజకీయంగా జన్మనిస్తే, ఆ ఇద్దరు తోడుదొంగలై ఈ జిల్లాను భ్రష్టు పట్టించారని మహబూబ్​నగర్​ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె, సీఎం రేవంత్​, బీఆర్​ఎస్​ అధినేతపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

DK Aruna on Congress and BRS
DK Aruna Comments on Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 2:20 PM IST

DK Aruna Comments on Revanth Reddy : పాలమూరు జిల్లా ప్రజల ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగిన కేసీఆర్​, సీఎం రేవంత్​ రెడ్డి నేడు ఇద్దరు తోడు దొంగలై జిల్లాను భ్రష్టు పట్టించారని మహబూబ్​నగర్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​లకు ఓటేస్తే ఓటు మురిగిపోయినట్టేనని విమర్శించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడా, కొందుర్గు, ఫరూక్ నగర్ మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇప్పించలేదని తనపై అవాకులు చవాకులు మాట్లాడితే ఏదైనా సంబంధం ఉందా అని డీకే అరుణ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒక్కో దగ్గర ఒక్కోలాగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్​లో పోటీ చేస్తున్న మహిళలను గెలిపించాలని కోరుతూ మహబూబ్​నగర్ పాలమూరు ఆడబిడ్డను అయిన తనను ఓడించాలని కోరడం ఏంటని విమర్శించారు. రేవంత్​కు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు రాజకీయ భవితవ్యాన్ని ఇచ్చారని, నేడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేశారని ప్రశ్నించారు.

ఇద్దరి ఆలోచన విధానాలు ఒక్కటే : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానాల్లో ఇద్దరు ఒకటేనని, ఇద్దరు కలిసి పాలమూరు జిల్లాను దోచుకునేందుకు వెనకాడబోరని డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ ఎన్నికలు దేశం కోసం ధర్మం కోసమని, ఆడబిడ్డ అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ నెల 24న సీఎం రేవంత్​పై డీకే అరుణ నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని అంటున్న రేవంత్​, డిసెంబర్​ 9న అధికారంలోకి రాగానే రుణమాఫీ అమలు చేస్తామని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు సీఎం ఏం చేశారో చెప్పకుండా తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

'భారతదేశంలో పేద ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. అనేక పథకాలు చేపట్టారు. ఇవాళ ప్రతి గ్రామంలో అభివృద్ధి జరగుతుందంటే నరేంద్ర మోదీ దిశానిర్దేశంతో జరగుతోంది. పేద ప్రజలకు ఇళ్లు రావాలంటే కచ్చితంగా నరేంద్ర మోదీని గెలిపించాలి.' - డీకే అరుణ, మహబూబ్​నగర్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి

'రేవంత్​ రెడ్డి, కేసీఆర్​ ఆలోచన విధానాలు ఒక్కటే -పాలమూరు జిల్లాను భ్రష్టు పట్టించారు'

రేవంత్‌ రెడ్డికి నేను సాటి కానప్పుడు - నాపై విమర్శలు ఎందుకు?: డీకే అరుణ - DK ARUNA SLAMS CM REVANTH

'మహబూబ్​నగర్​లో కాంగ్రెస్​కు ఓటమి భయం పట్టుకుంది - అందుకే గుంపులుగా వచ్చి నాపై ముప్పేట దాడి' - DK Aruna Fire on CM Revanth

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.