ETV Bharat / politics

మదనపల్లె అగ్ని ప్రమాదంపై ఎన్నో అనుమానాలు- డీజీపీ విచారణలో విస్తుపోయే వాస్తవాలు - Fire accident at Madanapally

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 7:57 PM IST

Fire accident at Madanapally RDO office: కీలక దస్త్రాలున్న మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాకపోవచ్చని డీజీబీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం ఘటనపై విచారణ చేసిన డీజీపీ, ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని వెల్లడించారు.

fire_accident_at_madanapally_rdo_office
fire_accident_at_madanapally_rdo_office (ETV Bharat)

Fire accident at Madanapally RDO office: మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌ అని భావిస్తున్నాం అని డీజీపీ ద్వారకా తిరుమల రావు వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి 11.30 గం.కు ఆర్డీవో కార్యాలయంలో ఫైర్‌ ఇన్సిడెంట్‌ జరిగిందని, ఫైర్ ఇన్సిడెంట్‌ సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ.. కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. ఆర్డీవో కార్యాలయంలో 22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, కీలక దస్త్రాలు ఉన్న విభాగంలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కార్యాలయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగేందుకు అవకాశం లేదన్న డీజీపీ... స్థానిక సీఐ తో పాటు ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని, ఘటనపై దర్యాప్తు కోసం పది బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు.

మదనపల్లె ఘటనపై సీఎం సీరియస్-తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని డీజీపీ, సీఐడీ చీఫ్ కు ఆదేశాలు - records burning

మదనపల్లె అగ్ని ప్రమాద ఘటనలో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోందని డీజీపీ చెప్పారు. ఫైర్‌ యాక్సిడెంట్‌ కాదు.. ఫైర్‌ ఇన్సిడెంట్‌.. ఘటన తీరును బట్టి చూస్తే ఇన్సిడెంట్‌గానే భావిస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో వీఆర్‌ఏ ఒక్కడే ఉన్నాడని, ఘటనపై వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. ఆర్డీఓ ఆఫీసులో కీలక సెక్షన్‌లో ఇన్సిడెంట్‌ జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. షార్ట్ సర్క్యూట్‌ అయ్యే అవకాశం లేదని విచారణలో తేలిందని, ఇక్కడ ఓల్టేజ్‌ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ప్రాథమిక విచారణలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని, ఆర్డీవోకు తెలిసినా వెంటనే కలెక్టర్‌కు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎస్‌ఐ కూడా ఉన్నతాధికారులకు వెంటనే చెప్పలేదని పేర్కొన్నారు. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయన్న డీజీపీ.. షార్ట్‌ సర్క్యూట్‌కు అవకాశం లేదని ఫోరెన్సిక్‌ వాళ్లు చెప్పారని, కాగా ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయని వెల్లడించారు.

విజయవాడ కరకట్టపై కూడా ఇలాగే ఫైళ్లు తగులబెట్టారన్న డీజీపీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలపై పోలీసులకు చెప్పాలని కోరారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని, సీఐడీకి కేసు బదిలీ అంశంపై రేపు లేదా ఎల్లుండి నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారుల అలసత్వం కనిపిస్తున్నా.. కుట్రో కాదో విచారణలో తేలుస్తామన్నారు. అన్ని విషయాలు ఇవాళే చెప్పలేం.. చెప్పకూడదని డీజీపీ స్పష్టం చేశారు.

25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. ఈ 25 సబ్జెక్టుల్లో చుక్కల భూములు, నిషేధిత భూములు ఉన్నాయని, కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వివరించారు. షార్ట్‌ సర్క్యూట్‌ కానప్పుడు ఫైర్‌ ఎలా జరిగిందనేది తేలాల్సి ఉందని చెప్పారు.

ఫైళ్ల దహనం ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు- నిందితులు వీరే! - Document Burning in Vijayawada

కూటమి భేటీలో ఆసక్తికరమైన చర్చ-కక్ష సాధింపు కోసం మనల్ని గెలిపించలేదన్న సీఎం - NDA alliance meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.