CPM CPI State Conference Meeting: ఏపీకి కావల్సింది బటన్లు నొక్కడం కాదని, అభివృద్ధికరమైన అసమానతలు లేని ప్రజా ప్రణాళిక అవసరమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ- జనసేన కూటమిని, నిరంకుశ వైఎస్సార్సీపీని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజ్యాంగానికి ప్రమాదం మోదీ వల్లనే వచ్చిందని, 5 స్వతంత్ర సంస్థలను ప్రధాని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీజేపీతో జత కడుతున్న పార్టీలను వ్యతిరేకించాలి' అనే అంశంపై విజయవాడలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అఖిలపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలించేది మాత్రం బీజేపీ అని వ్యాఖ్యానించిన ఆయన ఇక్కడ ఉన్న వాళ్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే అన్నారు.
'జగన్‌ను ఓడిస్తేనే సర్పంచులకు మనుగడ'- విజయవాడలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సమావేశం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇష్టంతో బీజేపీతో జట్టు కట్టలేదని భయంతో మాత్రమే కలిసి ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజులు రాజమండ్రి జైలులో ఉండడానికి కారణం కూడా బీజేపీ అని తెలిపారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అవకాశం ఇవ్వలేదన్నారు.
బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందన్న ఆయన తెలంగాణలో టీడీపీతో బీజేపీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనను పెట్టి చంద్రబాబును బెయిల్‌పై విడుదల చేయించారని వెల్లడించారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
నాలుగున్నర ఏళ్లలో జగన్ రెడ్డి అరాచక పాలనే రాజధాని ఫైల్స్ సినిమా: దేవినేని ఉమా
"ఏపీకి కావల్సింది బటన్లు నొక్కడం కాదు. అభివృద్ధికరమైన అసమానతలు లేని ప్రజా ప్రణాళిక అవసరం. అలాంటి ప్రణాళికను వామపక్షాలు మాత్రమే ఇవ్వగలవు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ- జనసేన కూటమిని, నిరంకుశ వైఎస్సార్సీపీని వ్యతిరేకించాలి. రాజ్యాంగానికి ప్రమాదం మోదీ వల్లనే వచ్చింది. 5 స్వతంత్ర సంస్థలను ప్రధాని ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలించేది మాత్రం బీజేపీ. ఇక్కడ ఉన్న వాళ్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భయంతో మాత్రమే బీజేపీతో జట్టు కట్టారు." - కే. నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
"ఏపీలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. పైగా పార్లమెంట్లో ఒకచేయి ఎత్తమంటే.. వైఎస్సార్సీపీ నేతలు రెండు చేతులు ఎత్తుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీజీపీ మీద ప్రేమ లేకపోయినా భయంతో మాత్రమే ఆ పార్టీతో కలిసి ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజులు రాజమండ్రి జైలులో ఉండటానికి కారణం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్." - కే. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి