CPI MLA Kunamneni Comments on KCR : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ చేసిన పాపమే ఇప్పుడు చుట్టుకుంటుందన్నారు. శాసనసభ్యులు పార్టీ మారుతుండటంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు గుండెలు పిండుకుంటాన్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ భయంతోనే పార్టీ ఫిరాయింపుల చేస్తుంది తప్పితే కక్షతో కాదన్నారు. ఏదేమైనప్పటికీ పార్టీ ఫిరాయింపులను సీపీఐ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీగా పేర్కొన్న కూనంనేని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. సింగరేణిలేని తెలంగాణను ఊహించుకోలేమని ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని ఎమ్మెల్యే కూనంనేని వివరించారు.
Kunamneni Fires on Singareni Auction : తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహారించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ రాసిచ్చారని, కేసీఆర్ చేసిన పాపానికి సింగరేణి ప్రమాదంలో పడిందని విమర్శించారు. అదానీ. అంబానీలు సింగరేణిని కొనుగోలు చేసే కుట్రకు కేసీఆర్ సహకరించారని మండిపడ్డారు.
"కేసీఆర్ చాలా బాధ పడిపోతున్నారు. మొత్తం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. ఇది అక్రమం, అన్యాయం అంటున్నారు. నాకు ఇదే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దొంగే దొంగ దొంగ అని మొత్తుకున్నట్లుగా, అసలు వీటిని నేర్పించింది ఎవరు? గతంలో మీరు ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పుడే, అసలు మిగిలిన పార్టీల వారిని ఎవరినైనా ఉంచారా మీరు? మీరు చేసిన పాపమే మీకు చుట్టుకుంది."-కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జులై 5న బంద్ : సింగరేణిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే మోదీ కుట్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భాగస్వామ్య అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత సీపీఐపైన ఉందన్న సాంబశివరావు, సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జులై 5న కోల్‌బెల్ట్ బంద్ నిర్వహిస్తామని తెలిపారు. 15రోజులపాటు నిరాహార దీక్షలు చేస్తామని కలెక్టరేట్‌లను ముట్టడిస్తామన్నారు. ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి సిద్దం కావాలని తెలిపారు.
సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా : కిషన్‌రెడ్డి - Kishan Reddy on Coal Mine Auction