ETV Bharat / politics

తరలివచ్చిన ఆశావహులు - 300 దాటిన దరఖాస్తులు - Congress Loksabha Application 2024

Congress MP Tickets Applications 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ కోసం 306 మంది దరఖాస్తు చేయగా ఒక్కో నియోజకవర్గానికి సగటున 18 మంది నేతలు రేస్​లో ఉన్నారు. హస్తం పార్టీ చెందిన వారే కాకుండా వివిధ రంగాల్లో పనిచేస్తున్న అధికారులు ఎంపీ టికెట్ల కోసం అర్జీ పెట్టుకున్నారు.

Competition For Congress MP Tickets 2024
Congress MP Tickets Applications 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 9:50 AM IST

Updated : Feb 4, 2024, 10:07 AM IST

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం భారీగా దరఖాస్తులు

Congress MP Tickets Applications 2024 : హస్తం పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగేందుకు భారీ సంఖ్యలో నాయకులు ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో అధికారం ఉన్నందున గెలుపు తథ్యమని భావిస్తున్న నేతలు టికెట్ కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం ప్రతి లోకసభ స్థానాన్ని అత్యంత ప్రాముఖ్యమైందిగా భావిస్తుడంటంతో, అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజీపడకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగాలని ఆత్రుతగా ఉన్న నాయకుల నుంచి అర్జీలను ఆహ్వానించింది.

Competition For Congress MP Tickets 2024 : జనవరి 31 నుంచి ఈనెల 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం అవకాశం కల్పించింది. తొలిరోజు ఆశించిన స్థాయిలో స్పందన లేకపోగా ఆ తర్వాత రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ వచ్చింది. బుధవారం 7, గురువారం 34, శుక్రవారం రోజు దాదాపు 100 అర్జీలు వచ్చాయి. శనివారం చివరి రోజు కావడంతో ఏకంగా 166 దరఖాస్తులు వచ్చాయి. 17 నియోజకవర్గాలకు 306 మంది అర్జీ చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంటే ఒక్కో నియోజకవర్గానికి సగటున 18 మంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి మాస్‌ వార్నింగ్‌

మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు (Hanumantha Rao)ఖమ్మం నుంచి పోటీకి దరఖాస్తు చేశారు. ఇక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని గాంధీ భవన్‌కు వచ్చి అర్జీ అందిచారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి సైతం ఈ స్థానం నుంచి పోటీకి ఆసక్తితో ఉన్నారు. ఖమ్మం టికెట్ ఆశిస్తున్న మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అనుచరులతో కలిసి దరఖాస్తు అందజేయించారు.

Congress Loksabha Huge Number Applications : నల్గొండ నుంచి పోటీకి పటేల్ రమేశ్​రెడ్డితో పాటు జానారెడ్డి కుమారుడు రఘువీర్​రెడ్డి దరఖాస్తు అందించారు. భువనగిరి నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కోమటి రెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్ రెడ్డి, బండ్రు శోభారాణి, సికింద్రాబాద్ నుంచి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, డాక్టర్ వేణుగోపాలస్వామి, అనిల్​కుమార్‌ యాదవ్ టికెట్లు ఆశిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీస్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని భట్టి నందిని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాగర్​కర్నూల్ నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) , పీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేశ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. చేవెళ్ల నుంచి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మల్‌రెడ్డి రామిరెడ్డి తదితరులు దరఖాస్తు చేశారు. మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఖమ్మం, సికింద్రాబాద్ టికెట్లు ఆశిస్తూ గాంధీ భవన్‌లో అర్జీ పెట్టుకున్నారు.

మెదక్ నుంచి పోటీకి పీసీసీ అధికార ప్రతినిధి ఎం.భవాని రెడ్డి, బండారు శ్రీకాంత్, మహబూబాబాద్ నుంచి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ బట్టు రమేశ్‌ నాయక్, కాశీరాం నాయక్, విజయబాయి ఆసక్తిగా ఉన్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్‌ కుమారుడు గడ్డం వంశీ సహా పలువురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు.

లోక్​సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!

14 లోక్​సభ స్థానాలే టార్గెట్ - గెలుపు గుర్రాల ఎంపికపై నేడు కాంగ్రెస్​ కీలక సమావేశం

Last Updated : Feb 4, 2024, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.