ETV Bharat / politics

బీజేపీ అబద్ధాలు నమ్మి మోసపోయేది లేదని తెలంగాణ ప్రజలు మరోసారి రుజువు చేయాలి : ప్రియాంక గాంధీ - Priyanka Gandhi AT tandur sabha - PRIYANKA GANDHI AT TANDUR SABHA

Priyanka Gandhi at Tandur Jana Jatara Sabha : బీజేపీ అబద్ధాలు నమ్మి మోసపోయేది లేదని తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి చాటిచెప్పాలని ప్రియాంక గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రారంభించిన ప్రాజెక్టులు, పథకాలపై మోదీ తన ఫొటోలు వేసుకున్నారని మండిపడ్డారు.

Priyanka Gandhi Election Campaign in Telangana
Congress Leader Priyanka Gandhi Election Campaign in Tandur (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 4:59 PM IST

Congress Leader Priyanka Gandhi Election Campaign in Tandur : రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం దేశంలో జరుగుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేమీ ఉండవని విమర్శించారు. తాండూరు​ జన జాతర సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అంటే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.

ఇందిరాగాంధీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారని, ఆ తర్వాత సోనియమ్మపై అభిమానం చూపించారని ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు చెప్పే సమస్యలు వినటానికి కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తారని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాస్‌ సిలిండర్ ధర రూ.1200 ఉందని కానీ కాంగ్రెస్​ అధికారంలో ఉన్న తెలంగాణలో రూ.500కే ఇస్తున్నట్లు తెలిపారు.

Congress Leaders Election Campaign in Telangana : రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, పేద రైతులకు రూ.50 వేలు, రూ.లక్ష రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు బీజేపీ సర్కార్‌ అంగీకరించదని అన్నారు. బడా వ్యాపారులకు మాత్రం బీజేపీ సర్కార్​ రూ.16లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని ఆరోపించారు. కీలకమైన సంస్థలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆడిస్తారన్నారు.

రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న బీజేపీ - దాన్ని రక్షించాలనుకుంటున్న కాంగ్రెస్​ మధ్యే ఈ ఎన్నికలు : ఖర్గే - Mallikarjun kharge on MP Elections

ఈ 75 ఐదేళ్లలో ఎవరి పాలనలో అభివృద్ధి, మార్పు జరిగిందో గమనించాలి. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకునే ప్రయత్నాన్ని మోదీ ఎప్పుడూ చేయరు. ఎన్నికల వచ్చినప్పుడు మాత్రం వచ్చి ధర్మం అనే నినాదం ఎత్తుకుంటారు. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టి ఓట్లు వేయించుకుంటారు. కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు. కాంగ్రెస్‌ కొందరి ఆస్తులు గుంజుకుని మరో వర్గానికి ఇస్తుందని బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది. ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ధర్మం పేరిట ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. రద్దు చేయడానికి ఈ రాజ్యాంగాన్ని మోదీ రాయలేదు. మన పూర్వీకులు ఎంతో కృషి చేసి భావితరాల కోసం రాజ్యాంగం రూపొందించారు- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత

Priyanka Gandhi Fires On BJP Government : రాజ్యాంగమే మనకు ఎన్నో అవకాశాలు కల్పించిందని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది రాజ్యాంగం మాత్రమే అనే ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ ప్రాంతం ఎంతో సుభిక్షమైనదన్న ఆమె ప్రజలు ఎంతో కృషి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నారని పేర్కొన్నారు. బీజేపీ అబద్ధాలు నమ్మి మోసపోయేది లేదని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి చాటిచెప్పాలన్నారు.

ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని బీజేపీని అడగాలని సూచించారు. మతకల్లోలాలు ఉంటే ఈ రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వివరించారు. మతకల్లోలాలు జరుగుతున్న రాష్ట్రాలకు పెట్టబడులు రావటం లేదని గుర్తు చేశారు. మోదీ పదేళ్ల కాలంలో ధనిక వర్గాలకు మాత్రమే మేలు జరిగిందని, ఐదారుగురు మాత్రమే బిలియనీర్లుగా ఎదిగారని అన్నారు.

మేమంటే భయం అందుకే పదేపదే విమర్శలు - టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే మీరేం చేస్తున్నారు? : ఖర్గే - KHARGE SLAMS BJP COMMENTS

'అత్యున్నత పదవిలో పదేళ్లు ఉన్న మోదీ ఈ దేశానికి ఏం చేశారో ఎప్పుడూ చెప్పలేదు. తన బాధలు చెప్పుకున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ ప్రజల కష్టాలు మాత్రం వినలేదు. బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి గమనించాలి. కాంగ్రెస్‌ ప్రారంభించిన ప్రాజెక్టులు, పథకాలపై మోదీ తన ఫొటోలు వేసుకున్నారు'- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత

కాంగ్రెస్‌ గెలిస్తే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేసి ఆదుకుంటామని, ఉపాధి హామీ రోజువారీ కూలీని రూ.400కు పెంచుతామని అన్నారు. పేద కుటుంబాలను గుర్తించి ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు రూ.లక్ష ఇస్తామన్నా ఆమె యువత ఉద్యోగం సాధించే వరకు శిక్షణ భృతి ఇస్తామని స్పష్టం చేశారు.

27 రోజులు - 57 సభలు - టైమ్​ దొరికితే ఇంటర్వ్యూలు - కాంగ్రెస్​కు అన్నీతానై ప్రచారాన్ని హోరెత్తించిన సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth Reddy Corner Meetings

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.