ETV Bharat / politics

వైఎస్సార్సీపీ వైకుంఠపాళి- ఎవరిని నిచ్చెన ఎక్కిస్తారో, ఎవరిని జగన్​ మింగేస్తాడో!

YSRCP Candidates Selection : 'తిక్కోడు తిరునాళ్లకు పోతే ఎక్కాదిగా సరిపోయిందంట' సరిగ్గా అలా ఉంది సీఎం జగన్‌ వ్యవహారం. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో రివర్స్‌ పాలన సాగించిన జగన్ ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలోనూ అదే విధానాన్ని ఎంచుకున్నారు. అంతకుముందు వదిలిన జాబితాల్లోని వారి స్థానాలు మళ్లీ మళ్లీ మారుస్తున్నారు. దీంతో మిగిలేది ఎవరో? నిలిచేది ఎవరో? బరిలోకి దిగేది ఎవరో? అర్థంకాక వైఎస్సార్సీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. అయితే జగన్‌ ఆడుతున్న ఈ వికృత బంతాటలో అధికంగా బడుగులే బలవుతున్నారు.

ysrcp_candidates_selection
ysrcp_candidates_selection
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 7:05 AM IST

Updated : Mar 2, 2024, 10:23 AM IST

వైఎస్సార్సీపీ వైకుంఠపాళి- ఎవరిని నిచ్చెన ఎక్కిస్తారో, ఎవరిని జగన్​ మింగేస్తాడో!

YSRCP Candidates Selection : అంతా గజిబిజి, గందరగోళంలా ఉంది వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక తీరు! నియోజకవర్గాల సమన్వయకర్తల పేరుతో రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను మారుస్తున్న జగన్‌ చేష్టలతో ఆ పార్టీ నేతలు సైతం అయోమయంలో పడుతున్నారు. వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కినట్లే సమన్వయకర్తగా పదవినిస్తారు. ఆ వెంటనే పాము నోట్లో పడ్డట్లుగా తొలగించేస్తారు. ఇదీ పార్టీలో జరుగుతున్న తంతు. ఇక్కడ వారిని అక్కడకు, అక్కడ వారిని ఇక్కడకు మారుస్తున్నారు. తర్వాత వీరిలో కొందరినీ మరోచోటుకు ఈ మధ్యలో కొందరి టికెట్లు చిరిగిపోతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ రోజు ఎవరు పార్టీ సమన్వయకర్తగా ఉన్నారనేదీ ఎప్పటికప్పుడు జాబితాలను సరిచూసుకుని మరీ ఖరారు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మార్చిన జాబితాలనే మళ్లీ మారుస్తుండడం ఆ పార్టీలో నెలకొన్న అస్థిరతను చాటుతోంది. అభ్యర్థుల సీట్లతో పెద్దలు ఆడుతున్న ఈ వికృత క్రీడలో అత్యధికంగా బలహీన వర్గాల నేతల బలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నియోజకవర్గానికి ఎవరు పోటీలో నిలుస్తారనేది చెప్పడం కష్టమనే మాట వినిపిస్తోంది.

జగన్ పిలుపుతో నేతల గుండెల్లో పిడుగు - ఈ సారి కరివేపాకులు ఎవరో?

175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 ఎంపీ సీట్లు కొట్టాలంటున్న జగన్​ వైనాట్‌ కుప్పం(Why not Kuppam) అంటూ పదే పదే బీరాలు పోతున్నారు. కానీ, తన పార్టీలోనే అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఆ ఆత్మవిశ్వాసం ప్రదర్శించలేకపోతున్నారు. ఎవరిని ఎక్కడ ఎందుకు ఎంపిక చేస్తున్నారు? మళ్లీ ఎందుకు మార్చేస్తున్నారనే విషయం అర్థంకాక ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. సామాజిక సమీకరణాలంటూ అధిష్ఠానం నెలల తరబడి చేస్తున్న కసరత్తు అత్తెసరుగా మారిందని వాపోతున్నారు.

తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడుకు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం(Adimulam)ని తిరుపతి లోక్‌సభకు మొదట మార్చగా ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ఎంపీని మళ్లీ తిరుపతికే తెచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకి టికెట్‌ ఎగరగొట్టేసి సత్యవేడులో కొత్త వ్యక్తిని నియమించారు. ఇదే తరహాలోనే చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరుకు, అక్కడున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభకు మార్చారు. నారాయణ స్వామి ఎదురుతిరగడంతో మళ్లీ ఎవరి స్థానాలకు వారిని మార్చారు. ఇక ఇద్దరు ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటుంటే మళ్లీ గంగాధర నెల్లూరు నుంచి నారాయణ స్వామిని తప్పించేసి, ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా నియమించారు.

వైసీపీలో టికెట్‌లపై రాని స్పష్టత - వేర్వేరుగా ఉన్న పార్టీ, నేతల ఆలోచనలు

ఎక్కడో విద్యా సంస్థలు నిర్వహించుకుంటున్న డాక్టర్‌ పెంచలయ్యను (Penchalaiah) హడావుడిగా సీఎం తన పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరుతున్నపుడు పెంచలయ్యతోపాటు వచ్చిన ఆయన కుమార్తె కటారి అరవింద యాదవ్‌ను కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించేశారు. అక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డిని పక్కన పెట్టేశారు. అరవింద యాదవ్‌ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టకుండానే ఫిబ్రవరి 28న కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు. పెంచలయ్య పార్టీలోకి చేరకముందే ఎమ్మెల్యే మధుసూదన్‌ను కనిగిరి నుంచి తప్పించారు. ఇవ్వాలనుకుంటే అప్పుడే ఆయనకు కందుకూరు టికెట్‌ ఇచ్చి ఉండొచ్చు. అలా చేయకుండా పెంచలయ్యను పార్టీలోకి తెచ్చుకుని వారి కుటుంబానికి బాధ్యతను అప్పగించి తర్వాత వారిని కాదని ఎమ్మెల్యే మధుసూదన్‌కు ఇచ్చారు. పెంచలయ్య కుటుంబాన్ని ఎందుకు పార్టీలోకి తీసుకువచ్చారో? ఆయన కుమార్తెను సమన్వయకర్తగా ఎందుకు నియమించారో? ఇప్పుడు మళ్లీ వారికి చెప్పా చేయకుండా ఎందుకు తీసేశారో? ఎవరికీ అంతుపట్టడం లేదు.

వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై జగన్​ కసరత్తు - నేతలలో ఉత్కంఠ

అరకు MLA పల్గుణను పక్కన పెట్టిన అధిష్ఠానం ఎంపీ గొడ్డేటి మాధవి(Goddeti Madhavi)ని అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చింది. తర్వాత మాధవిని తీసేసి అరకు సమన్వయకర్తగా మరొకరిని నియమించింది. ఎమ్మిగనూరులో మొదట మాచాని వెంకటేష్‌, ఆ తర్వాత ఆయన్ను తప్పించి బుట్టా రేణుకను నియమించారు. ఇలా అస్థిర నిర్ణయాలతో పలు నియోజకవర్గాల్లో సీట్ల బంతాటను పార్టీ పెద్దలు కొనసాగిస్తూనే ఉన్నారు.

టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Last Updated : Mar 2, 2024, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.