ETV Bharat / politics

'అన్నొస్తే అంతే!' - అనకాపల్లి ప్రజలకు తప్పని అవస్థలు - CM Jagan Bus Yatra - CM JAGAN BUS YATRA

CM Jagan Bus Yatra : సీఎం జగన్​ బస్సుయాత్ర, సిద్ధం సభల కారణంగా సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్​ వస్తున్నారంటే రహదారుల నిర్బంధంతో వాహనాలు నిలిచి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా పట్టణాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది.

cm_jagan_bus_yatra
cm_jagan_bus_yatra
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 1:21 PM IST

CM Jagan Bus Yatra : ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రవేశించింది. పాయకరావుపేట వద్ద హైవే లోని వై జంక్షన్ వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికేందుకు సమీపంలోని మహిళలను తీసుకొని వచ్చారు. బస్సు నుంచే వారికి అభివాదం చేసిన జగన్మోహన్ రెడ్డి బస్సులో కూర్చున్నారు. పెద్దగా జనం లేకపోవడంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే వేగంగా తన బస ప్రాంతానికి చేరుకున్నారు. శనివారం నాడు అనకాపల్లి జిల్లాలో ఒకచోట బహిరంగ సభ లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి బస్సు యాత్ర సందర్భంగా హైవేపై రాత్రి సమయంలోనూ కొద్ది సమయం వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

ప్రజల పాలిట శాపంలా సీఎం జగన్ బస్సుయాత్ర - సామాన్యలపై పోలీసుల జులుం - CM Jagan Bus Yatra

సీఎం రాక నేపథ్యంలో అనకాపల్లిలో అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది. ఓ వైపు పోలీసులు మరో వైపు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా జనం రద్దీ లేక అనకాపల్లి జిల్లా గొడిచర్ల కూడలి వెలవెలబోయింది. సీఎం బయటకు రావడానికి సుమారు అరగంట ముందు నుంచే ట్రాఫిక్ ను పోలీసులు నిలిపివేశారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చెట్లు నరికేయడం - దుకాణాలు తొలగిస్తున్నారంటే 'అన్నొస్తున్నట్లే' - CM Jagan Tour Trees Cuts

పట్టు రైతులను పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ : పట్టు రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రికి నివేదించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. దాదాపు ఆరు గంటల పాటు నిరీక్షించినా నిరాశే మిగిలింది. శుక్రవారం కాకినాడలో సిద్ధం సభ ముగించుకుని తుని వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు చేబ్రోలు లో పట్టు రైతులు నిరీక్షించారు. తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందించేందుకు సుమారు ఆరు గంటల పాటు రహదారిపై ఎదురుచూశారు. అయితే, జగన్ బస్సు చేబ్రోలు వచ్చేసరికి పట్టు రైతులు వినతి అందించేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. కనీసం బస్సు ఆపి వినతిపత్రం తీసుకుంటారని పట్టు రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ముఖ్యమంత్రి జగన్ వారిని చూస్తూ ముందుకు సాగారే తప్ప వారి సమస్యను వినే ప్రయత్నం చేయలేదు. దీంతో పట్టు రైతులు ఆవేదనకు గురయ్యారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి మధ్యాహ్నం నుంచి ఇక్కడే నిరీక్షించి ఉన్న ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై జగన్​కు ఎంత ప్రేమ ఉందో దీనిని బట్టి తెలుస్తుందని వాపోయారు.

'అన్నొస్తే అంతే!' - అనకాపల్లి ప్రజలకు తప్పని అవస్థలు

భీమవరంలో సీఎం బస్సు యాత్ర - రోడ్డుకు ఇరువైపులా చెట్లు తొలగింపు - CM Jagan Tour Trees Cuts

అనకాపల్లి జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతోంది. గోడిచెర్ల లో సీఎం జగన్ బయలు దేరిన వెంటనే పది కిలోమీటర్ల దూరంలో గోకుల పాడు వద్ద జాతీయ రహదారి పై రాకపోకలు నిలిపేశారు. ఫలితంగా జాతీయ రహదారి పై గోకులపాడు నుంచి వమ్మువరం వరకు వాహనాలు నిలిచి పోయాయి. గంటన్నర పైగా వాహనాలు నిలిచి పోవడంతో, డ్రైవర్లు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే సరకు రవాణా లారీలు సైతం నిలిచి పోయాయి. జగన్ ప్రయాణం చేసేది తుని - అనకాపల్లి రహదారి వైపు ఐతే అనకాపల్లి - తుని వైపు జాతీయ రహదారిని మూసేశారు. సీఎం జగన్ ప్రయాణించే రహదారి వైపు హడావిడి చేశారు. అసలు జాతీయ రహదారిని నిర్బంధించాల్సిన అవసరం ఏమిటని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌ సభకు బస్సులు - జనానికి తప్పని తిప్పలు - CM Jagan Meetings

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.