ETV Bharat / politics

సీఎం జగన్‌పై రాయి దాడి కేసు - నిందితుడు సతీష్​కు బెయిల్ మంజూరు - ys jagan stone pelting case

CM YS Jagan Stone Pelting Case: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్​కు బెయిల్ మంజూరు అయింది. కండిషనల్ బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శని, ఆదివారాలు పీఎస్‌లో సంతకం చేయాలని సతీష్​కు కోర్టు ఆదేశించింది. కాగా ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా నిందితుడు సతీష్​ ఉన్నాడు.

CM YS Jagan Stone Pelting Case
CM YS Jagan Stone Pelting Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 5:55 PM IST

Updated : May 28, 2024, 6:39 PM IST

CM YS Jagan Stone Pelting Case: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్​కు విజయవాడ కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. శని, ఆది వారాలు అజిత్ సింగ్ నగర్ పీఎస్​లో సంతకాలు చేయాలని ఆదేశించింది. 50 వేల రూపాయలు చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఉత్తుర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా నిందితుడు సతీష్ ఉన్నాడు.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ డాబాకొట్ల సెంటర్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్​ మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగింది. ఈ దాడిలో జగన్‌కు స్వల్పగాయమైంది. జగన్‌ బస్సు యాత్ర విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌లోని గంగారం గుడి సెంటర్‌ వద్దకు చేరుకున్నాక, ఓ వైపు నుంచి రాయి వచ్చి జగన్​ మోహన్ రెడ్డికి తగిలింది. ఆ తరువాత పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్​కు రాయి తాకింది. ఈ ఘటనలో జగన్‌ మోహన్ రెడ్డి ఎడమ కనురెప్పపై భాగంలో స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. ‌దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, స్థానికుడు సతీష్​ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు సతీష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

సీఎంపై రాయి దాడి కేసుతో నాకు సంబంధం లేదు: దుర్గారావు - stone Pelting Case Suspect released

Stone Attack on CM Jagan : కాగా సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో నిందితుడిని ఏప్రిల్ 18వ తేదీన అరెస్టు చేసినట్లు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ని నిందితుడిగా తేల్చారు. అయితే ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు ఏ2 ప్రోద్బలంతో జగన్​పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది మాత్రం తేల్చకుండానే కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. నిందితుడికి మే 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు : సీఎంపై రాయి దాడి కేసులో వడ్డెరకాలనీకి చెందిన అయిదుగురిని ఏప్రిల్ 16 తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సతీష్‌ తప్ప మిగిలిన నలుగురు మైనర్లు. మూడు రోజుల విచారణ అనంతరం సతీష్‌ అరెస్టును 18వ తేదీన చూపించారు. అరకొర సమాచారంతోనే రిపోర్టు తయారు చేశారు. సీఎంపైకి సతీష్‌ రాయి విసిరినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనకు ఏ2 సూత్రధారి అని చెబుతున్న పోలీసులు ఆ వ్యక్తి పేరును మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.

సీఎం ప్రయాణించిన బస్సుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌టవర్‌ డంప్‌ విశ్లేషణ, సీడీఆర్‌ల ద్వారా సతీష్‌ను నిందితుడిగా తేల్చామని పోలీసులు తెలిపారు. రిమాండ్‌ రిపోర్టులో పలువురు సాక్షులను విచారించాలని, సాంకేతిక ఆధారాలను సేకరించాలని పేర్కొన్నారు. సతీష్‌ను విచారించినా ఆధారాలను పూర్తి స్థాయిలో సంపాదించలేదు. అనంతరం బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితుడు సతీష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విజయవాడ కోర్టు సతీశ్‌కు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది.

గులకరాయి కేసులో A1కి 14 రోజుల రిమాండ్ - A2 ఎవరో వెల్లడించని అధికారులు - Cm Jagan Stone Pelting Case

Last Updated : May 28, 2024, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.