ETV Bharat / politics

హైడ్రా పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తే క్షమించం : సీఎం సీరియస్​ వార్నింగ్​ - CM serious Hydra illegal collection - CM SERIOUS HYDRA ILLEGAL COLLECTION

CM Revanth on HYDRA : హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్​ అయ్యారు. హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

CM Revanth on HYDRA
CM Revanth on HYDRA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 3:21 PM IST

Updated : Aug 29, 2024, 8:50 PM IST

CM Revanth Serious on HYDRA Illegal Collections : హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకుని డబ్బులు అడుగుతున్నారని అన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కొన్నిచోట్ల రెవెన్యూ, మున్సిపల్​, ఇరిగేషన్​ అధికారులపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అక్రమంగా డబ్బు వసూలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్​ విభాగాలను సీఎం రేవంత్​ రెడ్డి అప్రమత్తం చేశారు.

గణేష్​ మండపాలకు ఉచిత విద్యుత్​ : గణేష్​ మండపాలకు ఉచిత విద్యుత్​ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్​ అందించాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో గణేష్​ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని, ఇందుకోసం అందరి సలహాలు, సూచనలు తీసుకునేందుకే ఈ సమావేశం నిర్వహిచామని సీఎం వెల్లడించారు. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉత్సవాలు నిర్వహించేట్లు జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరమన్నారు.

ప్రాంతాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రాంతాల వారీగా కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలని స్పష్టం చేశారు. వీవీఐపీ సెక్యూరీపై ప్రత్యేక దృష్టి సారించాలని సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా కీలకమైందని ఆయన వ్యాఖ్యానించారు. సెప్టెంబర్17న జరిగే రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, హైదరాబాద్ బ్రాండ్‌ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకరించాలన్నారు.

ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

గణేశ్‌ మండపం ఏర్పాటు చేస్తున్నారా? - ఈ నిబంధనలను తప్పనిసరి పాటించాల్సిందే - GANESH IDOL INSTALLATION GUIDELINES

ధూల్‌పేటలో వినాయక చవితి సందడి - ఏ గల్లీ చూసినా గణేశుడి విగ్రహాలే - Ganesh Idols Making In Dhoolpet

Last Updated : Aug 29, 2024, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.